వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేతలు ఇతర పార్టీ నేతల మీద విరుచుకుపడడం జరిగింది. 2024 ఫలితాలు వచ్చినప్పటి నుంచి వైసిపి నేత మాజీ మంత్రి ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా, రెండున్నర సంవత్సరం మంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు తన అనుచరులకు కూడా అందుబాటులో లేడట. ఆ నేత ఎవరో కాదు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైసిపి పార్టీల హవా చూపించారు.నెల్లూరు నియోజకవర్గం వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్.


అసెంబ్లీలో కూడా టిడిపి నేతల పైన సవాల్ విసురుతూ నానా హంగామా సృష్టించారు. వైసిపి బూతు మంత్రులలో ఒకరిగా ఫోకస్ అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాలలోకి అనూహ్యంగా వచ్చిన నేత.. ఆయన చిన్నాన్న మరణం తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారట. అప్పట్లో ఆనం ఫ్యామిలీ ఆశీస్సులతో కార్పొరేట్ గా కూడా గెలిచారట. నెల్లూరు రాజకీయాలలో మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గం అదే పై చేయి. దాదాపుగా 1970 నుంచి అక్కడ వీరిదే పై చేయి. కానీ 2014 ,19లో ఒకసారిగా సీన్ మారిపోయిందట.


నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసిపి హయాంలో మొదటిసారి మంత్రిగా పనిచేశారు. వైసిపి నేత జగన్ పైన ఎలాంటి అబాండాలు వేసిన కచ్చితంగా వాటిని తిప్పి కొట్టేవారు అనిల్. మంత్రి అయిన తర్వాత అనిల్ కుమార్ పూర్తిగా మారిపోయారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధికి ఏమీ చేయలేదని అక్కడ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారట. 2024 ఎన్నికల ముందు నెల్లూరు నియోజకవర్గంలోని వైసిపి పార్టీలో చాలామంది నేతలు కొన్ని కారణాల చేత దూరమయ్యారట. ఈ ఎన్నికలలో ఓడిపోతే రాజకీయల నుంచి తప్పుకుంటారనే సవాల్ కూడా చేశారు. నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు అనిల్. అయితే ఎన్నికల ముందు చేసిన సవాల్ గురించి అడగగా.. తన సవాల్ని ప్రత్యర్థులు తీసుకోలేదని మాట దాటేసారట. ఆయన మాట నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితులు మాత్రం ఆయన మాటకి అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఓటమి తర్వాత అనిల్ కుమార్ పార్టీలో యాక్టివ్ గా కనిపించలేదట. నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళిపోయి తన కుటుంబంతో కలిసి అక్కడ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అప్పుడప్పుడు సింహపురికి వస్తూ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే అనిల్ రాజకీయలకు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన ఆయన స్పందిస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: