ఇప్పటికే పార్టీ ఓడిన బాధ లో జగన్ ఉంటే పార్టీ లోని నాయకులంతా  మరిన్ని షాక్ లు ఇస్తున్నారు. సొంత పార్టీ నేతలే జగన్ కు హ్యాండిస్తున్నారు. జగన్ వైఖరి పై విసుగు చెందిన ఎమ్మెల్యే లు తిరుగు బాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారం లో ఉన్నప్పుడు తొడలు కొట్టిన వైసీపీ నేతలు  ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, పంచాయతీలు  ఖాళీ అయిపోయాయి. కడప జడ్పీ స్థానం కూడా చేజారి పోయే అవకాశం కనిపిస్తోంది. ఇంతకు ముందు కడప కు సంబంధించిన అన్ని వ్యవహారాలు అవినాష్ రెడ్డి చూసుకునేవారు. ఈ ఎలక్షన్స్ లో ఆయన ఓడిపోవడం తో సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఎమ్మెల్సీ గా బొత్స సత్య నారాయణ ఏక గ్రీవంగా  ఎన్నికయ్యారు. దీంతో వైసిపి కి కాస్త బలం వచ్చింది. 

ఈ సమయం లో అధినేత జగన్ కు షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ కూడా  పార్టీ మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ఏడుగురు  గెలిచిన  ఎమ్మెల్యే లు జగన్ పై తిరుగుబాటు చేయబోతున్నారట. జగన్ పిలిచినా కూడా వారు ఎక్కడికి వెళ్లడం లేదట. ఇలా ఎమ్మెల్యేలు, నాయకులంతా జగన్ పై అలగడానికి కారణం ఆయన వైఖరి అన్నట్లు తెలుస్తోంది. కనీసం వారికీ సపోర్ట్ ఇవ్వకపోవడం, కష్టకాలం లో ఆదుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని సమాచారం.

తరచూ బెంగుళూరులో పోయి  ఉండడంతో  క్యాడర్ అంతా అసంతృప్తికి లోనైనట్టు సమాచారం. మరోవైపు బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా వైసిపికి షాక్ తగిలింది.  విజయవాడ ఎంపీ కేసీనేని చిన్ని బోండా ఉమా ఆధ్వర్యం లో  టిడిపి కండువా కప్పుకున్నారు. వీళ్లే కాకుండా ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా  టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఎప్పుడైనా వారు జంప్ అయిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: