అయితే ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు ఈ బదిలీలను సడలించింది. అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ కావడం ద్వారా బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. సచివాలయ వెబ్ సైట్ లో ఆయా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఖాళీల వివరాలను అందుబాటులో ఉంచుతారు.
ఉద్యోగుల దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి ప్రాధాన్య కేటగిరీల వారీగా విభజించి సీనియార్టీ, మెరిట్ ఆధారంగా ఆయా దరఖాస్తుల్నివిభజించడం జరుగుతుంది. ఈ నెల 31వ తేదీలోగా ఎస్వోపీ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియను చేపడతారని తెలుస్తోంది. ఎవరైనా ఉద్యోగులపై ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉంటే ఆ ఉద్యోగుల బదిలీలు చేపట్టే ఛాన్స్ లేదని తెలుస్తోంది. పాలన కారణాలు ఉంటే మాత్రం కలెక్టర్లు ఏ ఉద్యోగినైనా బదిలీ చేస్తారు.
ఏ ఉద్యోగి కూడా స్థానిక గ్రామ, వార్డులలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉండదు. నాన్-ఐటీడీఏ ప్రాంతాలతో పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీలకు సంబంధించి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీ చేసే ఉద్యోగులు 50 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలని తెలుస్తోంది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగ నియామకాలు జరిగి ఐదేళ్లు అవుతున్న నేపథ్యంలో బదిలీల దిశగా అడుగులు పడుతున్నాయి. ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉంటే మాత్రం ఆ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.