ఇది మంత్రాలు వేసిన దేవుడి ఉంగరం అని అనుకుంటారని కానీ కాదని నేను రాత్రి ఎంత సమయం పాటు నిద్రపోయానో శరీరం మళ్లీ ఎంతవరకు సిద్ధమైందో ఈ రింగ్ చెబుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఒక సెన్సార్ వచ్చిందని మీరు తినే తిండి వల్ల శరీరంలోకి ఎంత గ్లూకోజ్ వెళ్తుందో ఈ సెన్సార్ చెబుతుందని చంద్రబాబు కామెంట్లు చేశారు.
కేంద్రం సహాయంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నరేగా కింద 100 రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ పథకం ద్వారా ఏడాదికి 84 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితే మాత్రమే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తామని పశువుల షెడ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లోని పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని ఇళ్లకు విద్యుత్, సురక్షిత తాగునీరు ఇచ్చే బాధ్యత మాది అని ఆయన కామెంట్లు చేశారు. వైసీపీ పాలనకు, మా పాలనకు బేరీజు వేయాలని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ త్వరలో 16000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విషయమై ఎప్పుడూ ఆలోచిస్తుంటామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.