అయితే ప్రజాస్వామ్యవాదులు మాత్రం వైసీపీ నాయకులను అసెంబ్లీలోకి రావాలని కోరుతున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీలో ప్రజల కోసం పోరాడితే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే బొత్స సత్యనారాయణ మాత్రం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీలే అవసరం లేదు అని చెప్పుకొచ్చారు.
ప్రజల సమస్యలను ఎక్కడినుంచైనా పరిష్కరించొచ్చని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ ఇలాంటి కామెంట్లు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఒకలా అధికారం కోల్పోయిన సమయంలో మరో విధంగా వ్యవహరిస్తోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గతంలో అసెంబ్లీలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టసభలకు రావడం అనేది బాధ్యతాయుత శాసనసభ్యులకు ప్రధాన కర్తవ్యం అనే సంగతి తెలిసిందే. బొత్స సత్యనారాయణ తాను తప్పటడుగులు వేస్తూ పార్టీని ప్రమాదంలోకి నెడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బొత్స సత్యనారాయణ నెగిటివ్ కామెంట్ల గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. వైసీపీ ఇలాంటి తప్పులు రిపీట్ చేస్తే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రాబోయే రోజుల్లో అయినా వైసీపీ సరైన దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. జగన్ సైతం రాబోయే రోజుల్లో పార్టీ పుంజుకునే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.