2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మహిళల భద్రత గురించి చేసిన వ్యాఖ్యలు చేసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ దృష్టి మాత్రం వేరే రకంగా ఉందని కేవలం గ్రామాల అభివృద్ధి వైపు నుంచే అడుగులు వేయాలని భావించారట. ఇలాంటి సమయంలోనే తాజాగా హోం శాఖ మంత్రి పదవి తీసుకోకపోవడానికి గల కారణాలను సైతం తెలియజేశారు. ఇటీవలే అన్నమయ్య జిల్లాలో నిర్వహించిన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుట గ్రామసభలు పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది.


పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధిలో గ్రామాల అభివృద్ధి పాత్ర చాలా ముఖ్యము వీటన్నిటిని అభివృద్ధి చేయాలనేదే తన అంశము.. గతంలో ఉన్న ప్రభుత్వం నిధులను దారి మళ్లించిన పరిస్థితి చూశాము. అందుకే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాననే విధంగా తెలియజేశారు. మన రాష్ట్రంలో 13,326 పంచాయితీలు బలపడితే రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నా సరే మనం తీర్చగలము అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.


అలాగే తాను తీసుకున్నటువంటి బాధ్యతల గురించి కూడా మర్చిపోనని ఈ విషయం పైన ఎక్కడికి పారిపోనని..వీటి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటానని తెలియజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అద్భుతాలు చేయడానికి తన చేతుల్లో ఎలాంటి మంత్రదండం లేదని కూడా తెలిపారు. చంద్రబాబు అనుభవం కూడా ఏపీకి చాలా అవసరమని చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన తనకి కూడా ఉందని తెలియజేశారు. గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం బాగుపడుతుందని కూడా తెలియజేశారు. తనని హోంమంత్రి తీసుకోమని చాలామంది చెప్పారు . తన అన్న నటించిన రుద్రవీణ సినిమా కాస్త అన్నా హజారే గారి ప్రేరణతోనే తీసింది.. సర్పంచ్ కూడా అంతే బలవంతుడు అంటూ తెలియజేశారు. ఎక్కడో ఒక మిలిటరీలో పనిచేసీ మరి మహారాష్ట్ర లో ఒక గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ముందుకొచ్చి సర్పంచుగా ఎన్నికయ్యారనే  విషయం తో అన్న హాజరే అనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయం అటు గ్రామాన్నే కాదు దేశాన్ని కూడా కదిలించింది అంటూ వెల్లడించారు. మొత్తానికి తన అన్న చిరంజీవి నటించిన సినిమా వల్లే డిప్యూటీ సీఎం హోదాల ఈ శాఖలను తీసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: