టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, నందమూరి కుటుంబాలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీపై ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఏ హీరోపై జరగని స్థాయిలో బన్నీ టార్గెట్ గా ట్రోల్స్ జరగడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా బన్నీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ చేసిన పోస్ట్ కు స్పందన ఆలస్యంగా వచ్చినా మెగాస్టార్ చిరంజీవి స్పందించడం గమనార్హం.
 
హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఫ్యాన్స్ వల్లే తాను హీరో అయ్యానంటూ బన్నీ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా నా అనుకున్న వాళ్ల కొరకే వెళ్తానంటూ బన్నీ వెల్లడించారు. అయితే ఈ కామెంట్ల విషయంలో బన్నీపై ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మెగా క్యాంప్ సైతం బన్నీపై ఒకింత గరంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
 
మరోవైపు బాలయ్య ఎన్టీఆర్ మధ్య కూడా దాదాపుగా ఇదే సమస్య కొనసాగుతోంది. బాలయ్య ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు దాదాపుగా లేవు. బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు సైతం జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశాలు లేనట్టేనని సమాచారం అందుతోంది. సెప్టెంబర్ నెల 1వ తేదీన బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు జరగనున్నాయని తెలుస్తోంది.
 
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టగా తారక్ నటిస్తున్న దేవర మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకోనుందో చూడాల్సి ఉంది. దేవర సినిమా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుపుకొందని భోగట్టా.


మరింత సమాచారం తెలుసుకోండి: