* ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు బాలినేని సొంతం
* 2009లో చేనేత మంత్రిగా బాలినేనికి అవకాశం
* జగన్ కేబినెట్ లో కూడా మంత్రిగా బాలినేని


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది రాజకీయ నాయకులు ఏ పార్టీలోకి వెళ్లిన పదవులు అనుభవిస్తున్నారు. వాళ్లు ఎక్కడ ఉన్న రాజుల బతికేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది లీడర్లు ఏ పార్టీలో చేరినా కూడా... మంత్రి పదవి దక్కించుకోగలుగుతున్నారు. అలాంటి వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. బంధువు కూడా.


1999లో తన రాజకీయరంగేట్రం చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి... ఇప్పటివరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే 1999లో ఒంగోలు నియోజక వర్గం నుంచి.. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున బాలినేని శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించడం జరిగింది. అయితే 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు బాలినేని.

ఆ సమయంలో చేనేత, జౌలీ  శాఖ మంత్రిగా కూడా  బాలినేని శ్రీనివాస్ రెడ్డి పని చేయడం జరిగింది. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వైసీపీలో చేరిపోయారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైసీపీలో చేరిన తర్వాత.. మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు..  అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా కూడా బాలినేని పనిచేయడం జరిగింది.

ముఖ్యంగా.. ఒంగోలు ఎమ్మెల్యేగా ఏకంగా ఐదు సార్లు విజయం సాధించి చరిత్ర సృష్టించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో... దామరచర్ల జనార్దన్ రావు  చేతిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయారు.  మొన్నటి ఎన్నికల్లో... రిగ్గింగ్ జరిగిందని...  ఎన్నికల కమిషన్ కు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఎన్నికలపై   రీకౌంటింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: