ఎన్నికలకు ముందు నుంచి ఆసక్తికరంగా సాగిన దర్శి రాజకీయం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. వైసీపీ నుంచి సిట్టింగ్ వేణుగోపాల్ బదులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బరిలో నిలిస్తే.... తొలిసారి టీడీపీ నుంచి మహిళా నేత డాక్టర్ గోట్టేపాటి లక్ష్మి ఇక్కడ పోటీ చేశారు. ఇద్దరు డాక్టర్లు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు కావడంతో పోరు రసవత్తరంగా సాగింది.


అయితే రెడ్డి, కాపు సామాజిక వర్గాల గెలుపు, ఓటములను నిర్దేశించిన స్థాయిలో ఉన్న దర్శిలో 90.91% పోలింగ్ నమోదవడం కూడా రికార్డే. అయితే చివరాఖరికి విజయం మాత్రం వైసీపీనే వరించింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2,466 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దర్శిలో వైసీపీ గెలిచిన రాష్ట్రవ్యాప్తంగా ఎన్డిఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. దీంతో స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే ఉన్న ఆ హావా పెద్దగా ఉండకపోవచ్చనే చర్చ నడిచింది. కానీ ఇక్కడ పరిస్థితి అంతా రివర్స్ లో ఉంది. కొడుకు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా.... ఆయన తల్లి వెంకాయమ్మ జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నారు.


దీంతో రాజకీయంగా ఓ బలమైన నేపథ్యం ఉన్న బూచేపల్లి ఫ్యామిలీ నుంచి ఇక్కడ రెండు పవర్ సెంటర్లు గెలిచాయి. వ్యవహారం ఏదైనా ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ చుట్టూనే తిరుగుతుందట. దీంతో ఇక్కడ కూటమి తరపున పోరాడి ఓడిన టీడీపీ నేత లక్ష్మికి అధికార దర్పాన్ని చూపించే ఛాన్స్ అసలు రావడం లేదట. ఇప్పుడు బూచేపల్లి పవర్ సెంటర్లు ఆమె పాలిట పొలిటికల్ శాపాలుగా మారాయనే టాక్ వినిపిస్తోంది. ఏ రకంగా చూసిన ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్ లకు అధికారికంగా ప్రాధాన్యత ఉంటుంది.


కానీ ప్రభుత్వం కూటమిది కాబట్టి నియోజకవర్గంలో ఓడిపోయినా అనధికారిక ఎమ్మెల్యేగా హవా తనదే ఉంటుందని గోట్టిపాటి లక్ష్మీ భావించారు. కానీ ప్రోటోకాల్ పరంగా దర్శిలో ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. అందుకే గోట్టిపాటి లక్ష్మికి రాష్ట్రస్థాయి కేబినెట్ హోదా ఉండే ఏదో ఒక పదవి ఇవ్వాలని అప్పుడే బూచేపల్లి ఫ్యామిలీ పొలిటికల్ డామినేషన్ కి బ్రేకులు పడతాయని ఆమె వర్గీయులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: