తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి తెలిసిన వాళ్లకు గంటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. కాపు వర్గానికి చెందిన ఈ నేతకు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉంది. 1999 సంవత్సరంలో పాలిటిక్స్ లోకి వచ్చిన గంటా తొలి ప్రయత్నంలో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు.
 
2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాగా కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో ఆయన మంత్రి అయ్యారు. ఈ విధంగా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో మంత్రి కావడం కేవలం గంటా శ్రీనివాసరావుకు మాత్రమే చెల్లిందని చెప్పవచ్చు.
 
2014లో భీమిలి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు మానవ వనరుల అభివృద్ధిశాఖ, ప్రైమరీ ఎడ్యుకేషన్‌, సెకండరీ ఎడ్యుకేషన్‌, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా పని చేశారు. పార్టీలు, పోటీ చేసే నియోజకవర్గాలు తరచూ మారుస్తాడనే విమర్శ ఉన్నా అద్భుతంగా రాజకీయాలు చేసే విషయంలో గంటా శ్రీనివాసరావుకు ఆయనే సాటి అని చాలామంది భావిస్తారు.
 
ఈ ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచారు. గంటా శ్రీనివాసరావు రాబోయే రోజుల్లో పాలిటిక్స్ లో మరిన్ని సంచలనాలు సృష్టించడంతో పాటు మరిన్ని పదవులను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. తాజాగా జరిగిన సెజ్ ప్రమాద ఘటనపై గంటా శ్రీనివాసరావు విచారణ వ్యక్తం చేశారు.. ఈ ఘటనను వైసీపీ రాజకీయం చేయడంపై ఆయన విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: