ఎన్నికల ముందు వైసీపీ శిబిరం నారా లోకేష్‌ను అసమర్థ  రాజకీయ నాయకుడిగా చూసింది. లోకేష్ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతుంటే ఇతనికి ఏమైనా మతి చెడిందా అని చాలామంది వైసీపీ నేతలు అవహేళన చేశారు. వాళ్లు అభిప్రాయం ప్రకారం 2024లో కచ్చితంగా జగనే అధికారంలోకి రావాలి. అలాంటప్పుడు లోకేష్ రెడ్ బుక్ పట్టుకొని అందరి పేర్లు రాయటం ఎందుకు. ఆలు లేదు చూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం చందాన ఉంది అని అందరూ భావించారు.  లోకేష్ పేరును కూడా జగన్ ప్రస్తావించకపోవడంతో వారు ఆయనను పట్టించుకోలేదు. అయితే, ఈ ఏడాది ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం తర్వాత, లోకేష్ పట్ల వైసీపీ వైఖరితో సహా ప్రతిదీ మారిపోయింది.

లోకేశ్‌ను పట్టించుకోకుండా ఉండే జగన్ ఇప్పుడు బహిరంగ సభల్లో మాట్లాడిన ప్రతిసారీ ఆయన పేరును, రెడ్ బుక్ రాజ్యం అని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల, వైసీపీ సోషల్ మీడియా ఖాతాలో లోకేష్ విదేశీ పర్యటనపై ప్రతికూల పోస్ట్‌ను పంచుకున్నారు. దీనికి ప్రతిగా, టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ కూడా అదే తీవ్రతతో ఎదురు కాల్పులు జరిపింది.

"మరోసారి రహస్యంగా విదేశాలకు నారా లోకేష్. పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా విదేశాలకు లోకేష్‌. రెండు వారాల్లో ఇది రెండోసారి.
ఎక్కడకు వెళ్లాడో మరి?" అని తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఒక ట్వీట్ చేసింది.  టీడీపీ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ ఈ అవమానకర ట్వీట్‌కు వెంటనే రిప్లై ఇచ్చింది.

"మొత్తానికి లోకేష్ అంటే.. పడుతున్నాయి... నిన్న అమిత్ షా పిలిస్తే, ఢిల్లీ కూడా వెళ్ళారు.. తెలియదేమో అని చెప్తున్నాం.. లోకేష్ కి వ్యక్తిగత జీవితం ఉంటుంది.. పెళ్లి రోజులు ఉంటాయి, పుట్టిన రోజులు ఉంటాయి.. రైట్ రాయల్ గా, పాస్ పోర్ట్, వీసాతో ఎక్కడికైనా వెళ్తారు.. అందరి బ్రతుకు, నీలాంటి బ్రతుకు ఉండదు కదా వైఎస్ జగన్..? నువ్వు లండన్ వెళ్ళాలంటే, కోర్టు పెట్టే భిక్షతో వెళ్ళాలి... లేదంటే మూలన కూర్చోవాలి.. లేదా మాకు భయపడి బెంగుళూరులో బ్రతకాలి.." అని దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. మరోవైపు అరే ఏ క్యా హై, అందరికీ అఫైర్స్‌ ఉంటాయా అని మిగతా వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: