అధికారం పోగానే పిల్లిలా మారిపోయారని సొంత పార్టీ నాయకులను కూడా పట్టించుకోవడంలేదని.. వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సుధీర్ రెడ్డి జమ్మలమడుగులో మీడియా సమావేశం పెట్టి మరీ తాను రాజకీయాలకు స్వస్తి చెప్తున్నట్టు ప్రకటిస్తారని.. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక నియోజకవర్గంలో పార్టీ నాయకులు.. కార్యకర్తలు కేసులతో ఇబ్బందులు పడుతుంటే.. వారిని అస్సలు పట్టించుకోవడం లేదంట సుధీర్ రెడ్డి. ఇలాంటి రాజకీయంతో సుధీర్ రెడ్డి ఐదేళ్లలో జమ్మలమడుగులో వైసీపీని కాపాడటం కష్టమే అన్న నిర్ణయానికి వైసీపీ అధిష్టానం కూడా వచ్చిందని తెలుస్తోంది.
జమ్మలమడుగు ఇన్చార్జిగా సుధీర్ ను తొలగించి కొత్తవాళ్లకు బాధ్యత అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి లేదా ఆయన కుమారుడికి జమ్మలమడుగు వైసిపి పగ్గాలు అప్పగిస్తారని నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువగా హైదరాబాదులో ఉండేందుకే ఇష్టపడ్డారు. ఇప్పుడు పార్టీ ఓడిపోయాక పూర్తిగా నియోజకవర్గాన్ని పక్కన పెట్టేసి హైదరాబాదులో తన వరకు సుఖంగా ఉంటున్నారని వైసిపి శ్రేణులు గగోలు పెడుతున్నాయి. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధీర్ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందారు.
మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి తో పాటు ఇతర నేతలు ఎవరిని కలుపుకుని వెళ్లలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అందరిని వదిలేసి తనకు రాజకీయాలు వద్దని.. హైదరాబాదులో గడుపుతూ.. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి పోతున్నారు. ఏది ఏమైనా సుధీర్ రెడ్డిని వైసీపీ పగ్గాల నుంచి తప్పించేయడం దాదాపు ఖరారు అయినట్టే. ఇదిలా ఉంటే.. సుధీర్ రెడ్డి ఎవరో కాదు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి స్వయానా బావమరిది కావడం విశేషం. మరి కేతిరెడ్డి అయినా తన బావమరిదికి చెప్పి చూస్తాడా..? అన్నది చూడాలి.