పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యారు. చంద్ర బాబు ప్రభుత్వానికి మద్దతిచ్చినప్పుడే ఆయన హోమ్‌ శాఖను తీసుకోవాలని చాలా మంది సలహా ఇచ్చారు. అయితే దానికి బదులు పవన్ కళ్యాణ్ వేరే పోర్ట్‌ఫోలియోలను ఎంచుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. హోం మంత్రిత్వ శాఖ తీసుకునేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదో వివరించారు. ప్రస్తుతం, పవన్ పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్, టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు. వీటన్నింటిలో పంచాయత్ రాజ్ పోర్ట్‌ఫోలియో ఆయనకు ఇష్టమైనది.

ఈరోజు రైల్వే కోడూరులో జరిగిన స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో హోం శాఖను ఎందుకు ఎంచుకోలేదో పవన్ కళ్యాణ్ కారణం చెప్పారు. "అన్నా హజారే స్ఫూర్తితో చిరంజీవి "రుద్రవీణ" సినిమా తీశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్‌ హజారే.. అట్టడుగు స్థాయిలో అభివృద్ధిపై దృష్టి సారించి సర్పంచ్‌లు పెనుమార్పులు తీసుకురాగలరని యావత్ జాతికి చాటిచెప్పారు. లోక్‌పాల్ బిల్లు, సమాచార హక్కు చట్టం అన్నా హజారే వల్లే సాధ్యమైందని.. దేశంలో సర్పంచ్‌గానే పెద్ద మార్పు తీసుకు రాగలమని ఆయన చూపించారు. మన గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ పోర్ట్‌ఫోలియోను ఎంచుకున్నాన"ని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఎంత క్లారిటీతో ఉంటారో, అయినా ఆయా మంత్రుల పదవులను ఎందుకు తీసుకున్నారో తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇంత అవగాహన ఉన్న రాజకీయ నాయకుడు ఏపీకి డిప్యూటీ సీఎం గా రావడం తమ అదృష్టం అని పేర్కొంటున్నారు. నెక్స్ట్ సీఎం పవన్ అయితే ఇంకా మంచిగా ఆయన పరిపాలన అందించే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ నుంచి చాలా ఆశిస్తున్నారు ప్రజలు ఈ ఐదేళ్లలో పవన్ మంచిగా పరిపాలన అందించి మంచి పేరు తెచ్చుకుంటే ఆయన సీఎం అవడం పెద్ద కష్టమేమీ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: