తాజాగా నాగార్జున ఇఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చేయడంతో ఒక్కసారిగా మీడియాలో ఈయన గురించి చర్చనీయాంశంగా మారింది. తుమ్మిడి కుంట చెరువులో మూడున్నర ఎకరాల ల్యాండ్ ని కబ్జా చేసి నాగార్జున అక్రమంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో దాన్ని కూల్చేసింది. అయితే తాజాగా ఈ విషయంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్లు చేశారు.ఆయన మాట్లాడుతూ..2014లోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. అప్పుడే కోర్టు ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని చెప్పారు  కానీ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎందుకు స్పందించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయలేదు. ఇక దానికి తోడుగా సమంతకి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా పదవి ఇవ్వడానికి వెనుక ఉన్న అంతర్యం ఏమిటి.. 

కోర్టు ఆర్డర్ వేసిన కూడా కూల్చివేయకుండా 2014 నుండి దాదాపు పది సంవత్సరాలు అందులో ఎన్నో ఫంక్షన్లు జరిగాయి. ఇక ఒక్కో ఫంక్షన్ కి దాదాపు 50 లక్షలు నుండి కోటి రూపాయల వరకు తీసుకున్నారు.మరి పదేళ్లుగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి వచ్చిన ఖజానా మొత్తం గవర్నమెంట్ కి ఇచ్చేస్తారా.. టెక్నాలజీ కంప్యూటర్ గురించి ఎంతో తెలిసిన మీరందరూ ఇన్ని రోజులుగా ఎందుకు అక్రమ నిర్మాణాన్ని అలాగే ఉంచారు.కేటీఆర్, పొంగులేటి శ్రీనివాస్, రేవంత్ రెడ్డి మీ ముగ్గురికి నా ఒకే ఒక్క ప్రశ్న.. 2015 నుండి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు పక్కన పెట్టారు కోర్టు ఆర్డర్ వేసిన దాని ప్రకారం ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని ఎందుకు కూల్చివేయలేదు..

 దీని వెనుక ఉన్న లాలూచీ ఏంటి..మీనామేషాలు ఏంటి అంటూ బిజెపి ఎంపీ రఘునందన్ రావు కేటీఆర్,రేవంత్ రెడ్డి లను ప్రశ్నించారు.ప్రస్తుతం రఘునందన్ రావు మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.అయితే గతంలో కేసీఆర్ బుల్డోజర్లను పంపించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయాలని చూసారు.కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ బుల్డోజర్లు  వెనక్కి తిరిగి వచ్చేసాయి. ఆ తర్వాత కొద్ది రోజులకి సమంతని చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా చేయడంతో దీని వెనుక ఏదో వెనుక ఏదో ఆంతర్యం ఉంది అని బీజేపీ ఎంపీ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: