ఏపీ వైసీపీ ఘోర పరాజయం పాలైనా జగన్ టార్గెట్ గా తరచూ విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బీజేపీ నేత సోము వీర్రాజు మాట్లాడుతూ జగన్ మామూలోడు కాదని జగన్ ఆలోచనలను అంచనా వేయలేమని కామెంట్లు చేశారు. జగన్ రాజధాని పేరు చెప్పి విశాఖలో 500 కోట్లతో విలాసవంతమైన బంగ్లా కట్టుకున్నారని రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని సోము వీర్రాజు పేర్కొన్నారు.
 
పరిపాలనపై ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తి గత ఐదేళ్లు సీఎంగా పాలించారని సోము వీర్రాజు తెలిపారు. గ్రామీణాభివృద్ధి గురించి వైసీపీకి ఏ మాత్రం అవగాహన లేదని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన పార్టీ గ్రామ పంచాయితీలను నిర్వీర్యం చేసిందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం జగన్ మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని సైతం నీరుగార్చారని ఆయన పేర్కొన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయితీల కోసం ఏకంగా 800 కోట్ల రూపాయలు విడుదల చేసిందని సోము వీర్రాజు వెల్లడించారు. విశాఖలో ఊహించని పరిణామాలను చూస్తున్నామని ఆయన కామెంట్లు చేశారు. రాష్ట్రంలోని ఇండస్ట్రీలలో ప్రమాదాలు రిపీట్ కాకూడదని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రం విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని సోము వీర్రాజు అన్నారు.
 
సోము వీర్రాజు చేసిన కామెంట్లు ప్రస్తుతం రాజకీయాల్లో ఒకింత సంచలనం సృష్టించాయి. సోము వీర్రాజు కామెంట్ల గురించి జగన్ నుంచి ఏమైన రియాక్షన్ వస్తుందేమో చూడాల్సి ఉంది. జగన్ 2029లో పార్టీ అధికారంలోకి రావడం కోసం సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్తారేమో చూడాల్సి ఉంది. ఇందుకోసం సరైన వ్యూహకర్తలను నియమించుకునే దిశగా జగన్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. వైసీపీ 2029 ఎన్నికల్లో సైతం ఓడిపోతే ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
.


మరింత సమాచారం తెలుసుకోండి: