కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో అక్రమ నిర్మాలను సైతం తొలగించేందుకు సిద్ధమయ్యింది. నిన్నటి రోజున నాగార్జున N కన్వెన్షన్ నీ కూల్చివేయడం జరిగింది. దాదాపుగా నాలుగు దశాబ్దాలకు పైగా వీటిని కాపాడుకుంటూ వస్తున్నారట. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మాదాపూర్ లోని తిమ్మడిగుంట చెరువులో నాగార్జున మూడున్నర ఎకరాలు భూమి ఆక్రమించి తన స్థలాన్ని వదిలేసి చెరువులో కట్టుకున్నారని N కన్వెన్షన్ ను కూల్చివేశారు. వీటి మీద ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయని కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తుంది.


అయితే నిన్నటి రోజున ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకొని వెళ్ళాగా.. కోర్టు ఆపివేయాలంటు స్టే విధించిందట.. కానీ అంతలోపే N కన్వెన్షన్ ను పూర్తిగా నేలమట్టం చేశారు. ఇప్పుడు మరొకసారి హైదరాబాదులో హైడ్రా రెచ్చిపోతోంది. చెరువు ఉనికిని దెబ్బతీసేలా ఉన్నటువంటి కట్టడాలను సైతం కులిచి వేయడానికి సిద్ధం అయిపోయింది. అయితే ఇలాంటి కూల్చివేతల విషయంలో బి ఆర్ ఎస్ పార్టీ సైలెంట్ గా ఉన్న ప్రతిపక్షమైన బిజెపి మాత్రం వీటికి సమర్థిస్తూ వస్తోంది.


ముఖ్యంగా N కన్వెన్షన్ కూల్చివేయడం పైన బిజెపి నాయకుడు రఘునందన్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సపోర్టివ్ గానే ఉన్నారు. ఇలా ఎన్నో ఇతర కట్టడాలను కూల్చివేయడంలో కూడా బిజెపి పార్టీ మాత్రం ఎలాంటి విమర్శలు చేయడం లేదు.దీంతో రాబోయే రోజుల్లో ఈ కూల్చివేతలు చాలా ముమ్మరంగానే జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిబంధనలను పట్టించుకోని భవనాలను సైతం కూల్చివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ రోజున కేటీఆర్ ఫామ్ హౌస్ని కూడా కూల్చివేస్తారనే అనుమానాలు కూడా ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. హైదరాబాదులో జంట జలాశయం పరిధిలో ఉండేటువంటి 111 జీవో అమలులో ఉన్నదట. ఈ ప్రాంతంలో భారీ కట్టడాలు ఎవరూ కూడా కట్టకూడదని.. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో చాలానే ఫామ్ హౌస్ లో ఉన్నాయని.. అందులో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా ఉన్నదని అందుకే అక్కడ కూల్చివేతలను కొనసాగించాలంటు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫామ్ హౌస్ తనది కాదని కేవలం తన ఫ్రెండు దంటు కేటీఆర్ ప్రకటించారు ఒకవేళ అందులో ఏవైనా అవకతవకలు ఉంటే కచ్చితంగా తానే దగ్గరుండి మరి కూల్ చేయిస్తానని కూడా ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: