సోషల్ మీడియా ద్వారా గల్ఫ్ బాధితులను కాపాడిన లోకేష్

    * ప్రజల కష్టాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే పరిష్కరించిన లోకేష్

 తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన లోకేష్

 ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ కు మంచి గుర్తింపు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో... సోషల్ మీడియా ను వాడని నేత ఉండరు. తెలంగాణ రాష్ట్రం కంటే ఏపీలో ఉన్న రాజకీయ నేతలు అందరూ... ఇంగ్లీష్ మాట్లాడడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అయితే ఏపీలో  సోషల్ మీడియా స్టార్ గా చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ కు మంచి గుర్తింపు ఉంది. నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ... చెడుగుడు ఆడుకుంటారు నారా లోకేష్.



అదే సమయంలో ఏపీలో ఉన్న ప్రజల సమస్యలు తీర్చేందుకు కూడా... సోషల్ మీడియాని ఎంచుకున్నారు నారా లోకేష్. ఐటీ శాఖ మంత్రిగా అనుభవం ఉన్న నారా లోకేష్... ప్రతి సమస్యను సోషల్ మీడియా వేదికగానే స్పందించి.. పరిష్కరిస్తున్నారు. కరోనా సమయంలో కూడా...  చాలామంది ఏపీ ప్రజలను కాపాడారు. తెలంగాణ లేదా ఇతర రాష్ట్రాలలో బతుకుదెరువు కోసం వెళ్లిన.. ఏపీ ప్రజలను ఆదుకున్నారు నారా లోకేష్.


అన్నా నాకు ఈ సమస్య ఉందని పోస్ట్ పెట్టగానే... వెంటనే స్పందించి... ఏపీ ప్రజల సమస్యలను తీర్చగలిగారు నారా లోకేష్. అదే సమయంలో... జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా... సోషల్ మీడియా వేదికగానే సమాధానం చెప్పేవారు. వైసిపి నేతలు ఒక్కటంటే నారా లోకేష్ 10 పోస్టులు పెట్టి వాళ్ళని హింసించేవారు.



 ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు... జరిగిన అవినీతి అలాగే.. ఇతర సమస్యలపై సోషల్ మీడియా వేదిక గాని నారా లోకేష్ స్పందించి సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఏపీ రోడ్లపై పోస్టులు పెట్టి.. జగన్మోహన్ రెడ్డిని నిలదీయగలిగారు. ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ... వైసిపి పార్టీని నిలదీసి అధికారంలోకి వచ్చారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు... గల్ఫ్ బాధితులను కూడా కాపాడుతున్నారు నారా లోకేష్. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే గల్ఫ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: