సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు ఉన్న స్థాయిలో పొలిటికల్ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదనే సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న విడదల రజినికి ఈ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో కూటమి హవా ఉండటం వల్లే ఆమెకు ఆశించిన ఫలితాలు రాలేదని చాలామంది భావిస్తారు.
 
మాజీ మంత్రి విడదల రజినికి ఫేస్ బుక్ లో ఏకంగా 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె మాత్రం సోషల్ మీడియాలో కేవలం మూడు అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నారు. ఒకటి ఆమె పేరుతోనే ఉన్న సొంత అకౌంట్ కాగా మిగతా రెండు అకౌంట్లలో ఒకటి వైఎస్ జగన్ అకౌంట్, మరొకటి వైఎస్ భారతి అకౌంట్ కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తానని ఆమె నమ్ముతున్నారు.
 
ట్విట్టర్ లో సైతం విడదల రజినికి దాదాపుగా 1,80,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ట్విట్టర్ యూజర్ల సంఖ్య ఒకింత తక్కువే అయినా విడదల రజినికి ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం అందరికీ షాకిస్తోంది. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విడదల రజిని అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది.
 
విడదల రజిని పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగినా ఆమె మాత్రం వైసీపీకే పరిమితమయ్యారు. విడదల రజిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆమెకు మళ్లీ మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. విడదల రజిని ఉన్నత చదువులు చదివి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసిన మహిళ కావడంతో ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పాపులారిటీ ఉంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: