* జనసేన పార్టీ క్రియాశీలక నేతగా నాగబాబు
* పవన్ ను విమర్శిస్తే సొంతవారైనా డోంట్ కేర్
* సోషల్ మీడియా వేదికగా చివాట్లు..
మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అన్నయ్య చిరంజీవి చొరవతో సినీ రంగంలోకి వచ్చిన నాగబాబు ఎన్నో విలక్షణ పాత్రలలో నటించి మెప్పించారు..అలాగే ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షోతో జడ్జిగా నాగబాబు బాగా పాపులర్ అయ్యారు..ఇలా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, జడ్జి గా అద్భుతంగా రాణించారు.సినీ రంగంలో ఎంతగానో ఆకట్టుకున్న నాగబాబు తన తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలక నేతగా మారారు..పవన్ పార్టీని స్థాపించిన దగ్గరి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు.. పవన్ కు తోడుగా నాగబాబు ముందు నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా వుండే నాగబాబు తన అన్నయ్యను గాని, తన తమ్ముడిని కానీ ఎవరైన విమర్శిస్తే వారిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు.. తన అన్నయ్య, తమ్ముడు అంటే నాగబాబుకు అమితమైన ప్రేమ అందుకే వారిని ఎవరు విమర్శించిన వారిపై ప్రతి విమర్శలు చేస్తూ ఉంటారు.
తాను నిర్మాతగా వ్యవహరించిన ఆరంజ్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అప్పట్లో ఆత్మహత్య చేసుకోవలనుకున్నాని గతంలో తెలిపారు..ఆ సమయంలో పవన్ నాకు అండగా నిలబడ్డాడు.. కష్టాల్లో వున్న వ్యక్తిని చూస్తే పవన్ అస్సలు సహించలేడు.. అందుకే నా జీవితాంతం పవన్ కు తోడుగా వుంటాను అని నాగబాబు తెలిపారు..అయితే నాగబాబు మొదటిసారిగా 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నుంచి జనసేన తరపున పోటీ చేసారు. కానీ ఆ ఎన్నికల్లో నాగబాబు ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత 2024 లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసమే ఆయన కృషి చేసారు... పిఠాపురంలోనే వుంటూ పవన్ కల్యాణ్ కు అత్యధిక మెజారిటీ వచ్చేలా నాగబాబు చేసిన కృషికి జనసేన నేతలు కూడా ప్రశంసలు అందించారు. అంతే కాదు వైసీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో జనసేన ఫివర్ తీసుకువచ్చారు. 2024 కూటమి ప్రభుత్వ అఖండ విజయంలో పవన్ తోడుగా నిలుస్తూ నాగబాబు తనవంతు సాయం చేసారు..