ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి. అయితే తాజాగా ఓ హెలికాప్టర్ ప్రమాదం చంద్రబాబు మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ముంబై నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్... పూణే సమీపంలో కుప్పకూలింది. ఈ సంఘటన శనివారం రోజున జరిగింది. అయితే ఇందులో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతుంది.


ముంబై నుంచి విజయవాడ నగరానికి వస్తున్న నేపథ్యంలోనే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేకంగా ఈ హెలికాప్టర్ ను తీసుకు వస్తున్నారట.  నెల రోజుల కిందటే మెయింటెనెన్స్ లో ఉన్న.. ఈ హెలికాప్టర్ ను... వెంటనే విజయవాడకు తీసుకురావాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారట.


ఇందులో భాగంగానే ముంబై నుంచి నిన్న.. ప్రయాణించిన హెలికాప్టర్ పూణేలో కుప్పకూలింది. వాసవానికి ఏపీకి చెందిన ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్ను.. ఆగ మేఘాల మీద విజయవాడకు తరలించే ప్రయత్నం జరిగిందట. అయితే ఇంత అర్జెంటుగా హెలికాప్టర్ ను ఎందుకు తీసుకురమ్మన్నారని... దాని వెనుక ఏ అధికారులు ఉన్నారు అనే దానిపైన అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

 
అయితే ఈ హెలికాప్టర్ నిర్వహణ సంస్థ మాత్రం.. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యం లో...  ఆగ మేఘాలపైన విజయవాడకు తరలించినట్లు చెబుతున్నారు. వాతావరణం అను కూలించక పోయినా కూడా... హెలికాప్టర్ బయలుదేరాల్సి వచ్చిందని వెల్లడి స్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో... ఒక కో పైలట్... మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు అధికారులు చెప్పారు.  పైలెట్ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని అంటున్నారు. మరి ఈ హెలికాప్టర్ ప్రమాదంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంకా స్పందించలేదు. దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: