సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యేను కలవాలంటే ఎన్ని ఆంక్షలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే ఇల్లు లేదా ఆఫీస్ కు వెళ్లినా ఎమ్మెల్యేను కలిసే పరిస్థితి అయితే ఉండదు. అయితే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాత్రం ఇతర ఎమ్మెల్యేలకు భిన్నమనే సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మాత్రం స్వల్ప మెజార్టీతో ఆయన ఓటమిపాలయ్యారు.
 
ప్రస్తుతం ప్రజలకు పదవి వల్ల దూరంగా ఉన్నా గత ఐదేళ్లు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి చేసిన హడావిడి అంతాఇంతా కాదు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన దృష్టికి వచ్చిన ఆ సమస్యను పరిష్కరించే వరకు వెనుకాడేవారు కాదు. యూట్యూబ్ లో మాత్రం ఈ ఎమ్మెల్యేకు తిరుగులేదని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. కేతిరెడ్డి వీధివీధినా తిరిగి ప్రజల సమస్యలను పరిష్కరించిన వీడియోలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
 
ఎవరైనా అధికారి తప్పు చేస్తే తక్షణమే ఆ అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్లకు తన వంతు సహాయ సహకారాలు అందించడం ద్వారా ఆయన వార్తల్లో నిలిచారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమి పాలవ్వడం పొలిటికల్ వర్గాల్లో సైతం ఒకింత సంచలనం అయిందనే సంగతి తెలిసిందే. అయితే వైసీపీ చేసిన కొన్ని తప్పులే ఓటమికి కారణమని చెప్పవచ్చు.
 
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కొత్త ప్రభుత్వానికి కొంత సమయం గడువు ఇవ్వాలనే ఆలోచనతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయలేదు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం కేతిరెడ్డి కూటమి గురించి స్పందించి విమర్శించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. కేతిరెడ్డి ఓడిపోయినందుకు ఆయన అభిమానులు మాత్రం ఎంతో బాధ పడ్డారు. సర్వేలలో సైతం ఆయనకు అనుకూలంగా ఫలితాలు రావడం కొసమెరుపు. 2029 ఎన్నికల్లో కేతిరెడ్డి మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: