* క్వీన్ ఆఫ్ ది మాస్‌గా సోషల్ మీడియాలోనూ పాపులర్
* అన్ని పాపులర్ సోషల్ మీడియా సైట్స్ లో లక్షల్లో ఫాలోవర్లు
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి, తెలుగు మహిళా స్టేట్ ప్రెసిడెంట్ వంగలపూడి అనిత చాలా ధైర్యంగా మాట్లాడతారు. అసెంబ్లీలోనైనా, అసెంబ్లీ బయట అయినా సరే ఆమె ప్రత్యర్ధులను మాటలతోనే చిత్తు చేస్తారు. ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నిటినీ ఎదురొడ్డుతారు. అందుకే ఈమెను "ఫైటర్" అని పిలుస్తుంటారు. ఆమె ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో "క్వీన్ ఆఫ్ ది మాస్" గా పాపులర్ అయ్యారు. అనిత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వంగలపూడి అనిత 2009లో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి MA, M.Ed పూర్తి చేశారు. ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఆపై రాజకీయాల్లోకి వచ్చారు.
అనిత చాలా తెలివైన వారని చెప్పుకోవచ్చు. ఆమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయంపై స్పందిస్తారు. ప్రతిపక్ష నేతలు చేసే వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్లు ఇవ్వడంలో ఆమె నేర్పరి. విజయసాయి రెడ్డి వంటి వైసీపీ సీనియర్ నేతల నోర్లు కూడా ఆమె సింపుల్‌గా మూయించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లేదా ట్విట్టర్‌లో 84 వేల దాకా ఫాలోవర్లు ఉన్నారు. అనిత తాను చేస్తున్న పనులకు సంబంధించిన ఫొటోలు, అలానే సమాచారాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. ఆమె రోజూ వెళ్లే ప్రాంతాలు, ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు, పనులను ట్విట్టర్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇటీవల ఆమె ఒక ప్రమాదంలో గాయాల పాలైన వారికి నష్టపరిహారం అందజేసి ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. వంగలపూడి అనితకు ఫేస్‌బుక్‌లో 1 లక్షా 25 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో కూడా లక్షకు పైగానే ఫాలోవర్లు ఉన్నారు. ఒక ఏపీ హోమ్ మినిస్టర్ ఎలా చేస్తారు అనేది తెలియాలంటే ఈమె సోషల్ మీడియా అకౌంట్లో ఏదో ఒకటి ఫాలో కావచ్చు. ఈ ప్రభుత్వం ఎలా నడుస్తుందో అవగాహన పెంచుకోవడానికి అనిత అకౌంట్ స్టైల్ చెక్ చేస్తే సరిపోతుంది. అంత బాగా ఆమె ప్రతి దానిని షేర్ చేస్తున్నారు అలాగే రాష్ట్రంలో జరిగే ప్రతి విషయంపై స్పందిస్తున్నారు. అన్యాయాలను, అక్రమాలను నిలదీసి అడగడమే కాకుండా క్రైమ్ చేసిన వారికి తగిన శిక్ష పడేలాగా కూడా ఆమె చేస్తున్నారు.