-కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్రమంత్రిగా.!
- యూత్ లో అధిక ట్రోలింగ్  పాలిటిక్స్ కి కలిసొచ్చిందా.?
- తెలంగాణ బిజెపి సోషల్ మీడియా స్టార్ గా బండి టాప్.!


 తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఈ పొజిషన్ లో ఉంది అంటే దానికి ప్రధాన కారకుడు బండి సంజయ్ అని చెప్పవచ్చు. గత పది సంవత్సరాల క్రితం బిజెపి అంటే కనీసం హైదరాబాదులో ఏదో ఒక ప్రాంతంలో తప్ప రాష్ట్రంలో కనీస డిపాజిట్ కూడా వచ్చేది కాదు.  అలాంటి బిజెపి పార్టీని ఈ స్థాయిలో నిలపడానికి బండి సంజయ్ ఎంతో కష్టపడ్డారు. ఆయన కార్పొరేటర్ గా మొదటి గెలుపును అందుకొని కేంద్రమంత్రి  స్థాయికి ఎదిగారు. అలా బండి సంజయ్ ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా యూత్ ఫాలోయింగ్ అని చెప్పవచ్చు.  వివరాలు ఏంటో చూద్దామా..

 బండికి అండగా యూత్ ఫాలోవర్స్:
సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగిన లీడర్ బండి సంజయ్. ప్రతి ఒక్కరు అన్నా అని పిలిస్తే ఇట్టే పలుకుతాడు. ప్రస్తుతం కరీంనగర్ పేరుకు మణిహారంగా మారడని చెప్పవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన పేరు మర్మోగిపోతుంది. బిజెపిలో క్రమశిక్షణ కలిగిన రాజకీయ నాయకుడు అంటే బండి సంజయ్ అని చెప్పవచ్చు. బండి కామెంట్స్ చేస్తే చాలు ప్రభుత్వాల గుండెల్లో హడలు పుట్టేది. కాలు కదిపిన, మాట మాట్లాడిన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్  అవుతుంది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా యువత అంతా బండి సంజయ్ కి ఫాలోవర్స్ అని చెప్పవచ్చు. ఆ యువతే ఆయన గెలుపు పునాదివేసి కేంద్ర మంత్రిగా వెళ్లేలా చేసింది. 1971లో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన బండి సంజయ్.    విద్యార్థి దశ నుంచే బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఏబీవీపీ నుంచి మొదలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదురులేని నాయకుడిగా ఎదిగారు. 1994 నుంచి 2003 వరకు కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్  బ్యాంక్ డైరెక్టర్ గా పని చేశాడు.


 2005లో కరీంనగర్ పట్టణంలోని  48వ డివిజన్ నుండి  బిజెపి కార్పొరేటర్ గా గెలుపొందారు. ఆ తర్వాత రెండు సార్లు శాసనసభకు పోటీ చేశారు. ఇక 2019లో కరీంనగర్ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టారు. దాదాపు 96వేల మెజారిటీ సాధించారు. ఈ సమయంలోనే ఆయన విపరీతమైనటువంటి యూత్ ఫాలోయింగ్ ను పెంచుకొని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాడు. కేవలం బిజెపి నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు కూడా బండి సంజయ్ కి ఓటు వేసే అంతలా ప్రభావితం చూపాడు. తెలంగాణలో అంతటి ఆదరణ పొందిన బిజెపి నాయకుడు ఎక్కడ కూడా అధిష్టానానికి కనిపించలేదు. 2020 కల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.  దీంతో బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా యూత్ ని ఏకం చేసి  విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకొని యూత్ నాయకుడిగా ఎదిగి పార్టీని అంచలంచలుగా విస్తరించాడు.  ఆ తర్వాత 2024 ఎలక్షన్స్ లో  నరేంద్ర మోడీ క్యాబినెట్ లో కేంద్ర మంత్రిగా పదవి చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: