ముంబయి నుంచి బయల్దేరిన ఓ ప్రైవేట్ హెలీకాఫ్టర్ ఫుణేలోని పౌద్ సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి నుంచి విజయవాడ వస్తుండగా హెలీకాఫ్టర్ వస్తుండగా క్రాష్‌ అయింది. అయితే హెలికాఫ్టర్ కూలిన అనంతరం విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.


ఈ  హెలీకాఫ్టర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం ముంబయి నుంచి విజయవాడకు రప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుందని పలువురు పేర్కొంటున్నారు. నెల రోజుల నుంచి మెయింటెనెన్స్ లో ఉన్న హెలీకాఫ్టర్ ను ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే యత్నం చేశారు అధికారులు.

ఏవియేషన్ కో ఆర్డినేటర్ ఆఫీసర్ నరసింహరావు ఒత్తిడితోనే హెలీకాఫ్టర్ విజయవాడకు బయల్దేరినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి మరీ హెలీకాఫ్టర్ ను బలవంతంగా రప్పించే ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రమాదవశాత్తూ క్రాష్ అవ్వడంతో అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హెలీకాఫ్టర్ క్రాష్ పై అఉ పోలీసులు, ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.


ఒకవేళ అనుకోకుండా చంద్రబాబు ఆ హెలీకాఫ్టర్ ఎక్కితే జరగరానిది ఏదో జరిగేదే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదృష్టవశాత్తూ.. అది వస్తుండగానే క్రాష్ అయింది అని.. ఒకవేళ చంద్రబాబు ఎక్కి ప్రయాణిస్తున్న సమయంలో అయితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యేవి అని పేర్కొంటున్నారు.


అయితే ఈ హెలీకాఫ్టర్ నిర్వహణ సంస్థ మాత్రం.. ఏపీ సీఎం కార్యాలయం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఆగ మేఘాలపైన విజయవాడకు తరలించినట్లు చెబుతున్నారు. వాతావరణం అనుకూలించకపోయినా కూడా.. హెలీకాఫ్టర్ బయలు దేరాల్సిన వచ్చిందని వెల్లడిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఒక కో ఫైలెట్,.. మరో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయని అధికారులు చెప్పారు. ఫైలెట్ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని అంటున్నారు. మరీ హెలీకాఫ్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం కానీ స్పందించలేదు. మొత్తం మీద చంద్రబాబుకి పెను ప్రమాదం తప్పిందని టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: