•రాజకీయాలే కాదు సోషల్ మీడియాలో కూడా స్టారే..

•ఒక వీడియోతో భారీ పాపులారిటీ

•ప్రత్యర్థులపై మాటల వర్షం..


(ఆంధ్రప్రదేశ్ ఇండియా హెరాల్డ్)

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తరువాత రంగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాంబాబు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.  కాపు సామాజిక వర్గానికి చెందిన రేపల్లెలో ఏవీఎస్ఆర్ ఆంజనేయులు,  వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. విశాఖపట్నంలో న్యాయ విద్య పరిషత్ లా కాలేజీ నుండి 1986లో బిఎల్ పూర్తి చేసిన అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.

1988 లోనే గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ 1994లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలాగే సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కూడా పనిచేశారు. 1994, 1999 ఎన్నికలలో ఓటమిపాలైన ఈయన వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు 2014లో ఓడిపోయిన 2019లో 20వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.  2022 ఏప్రిల్ 11న వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో జల వనరుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇకపోతే మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ అయ్యారు అంబటి రాంబాబు. ముఖ్యంగా సుకన్య ఆడియో టేపుల లీక్ వివాదంలో కూడా ఈయన పేరు సోషల్ మీడియాలో బాగా మారు మ్రోగింది. దీనికి తోడు గతంలో రోడ్ల పైన సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొంటూ డాన్సులు వేయడం,  ప్రత్యర్థి పార్టీలను వ్యతిరేకంగా మాట్లాడుతూ కామెంట్లు చేయడం వల్ల సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు.  సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు అంబటి రాంబాబు. ఇక ఏదైనా విషయం గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలోకి వచ్చారు అంటే ఇక డిబేట్ ఎంతలా సాగుతుందో అందరికీ తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: