* సోషల్ మీడియాలో స్టార్‌గా రాణిస్తున్న విజయసాయిరెడ్డి  

* ఇతర రాజకీయ నేతల కంటే ఈయనకే ఎక్కువ ఫాలోయింగ్

* చురుగ్గా ఉండటమే కారణం

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

పార్లమెంటు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో వేసే పంచులు చాలామందికి నచ్చుతుంటాయి. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్‌తో పాటు ఆయన తనయుడు జగన్‌కి కూడా మంచి నమ్మకస్తుడిగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ పార్టీకి సెకండ్ ఇన్చార్జిగా విజయసాయిరెడ్డిని పేర్కొంటారు. ఈ సీనియర్ నేత సోషల్ మీడియాలో వైసీపీకి ప్రత్యర్థి పార్టీలైన నేతలను బాగా టార్గెట్ చేస్తుంటారు. అలాగే ఆ నేతలు చేసే దాడులకు సరైన బదులిస్తుంటారు.

ఈ నేత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఒక ఫైర్ బ్రాండ్ లాగా కొనసాగుతారు కాబట్టి ఆయనపై ఎక్కువగా ట్రోల్స్ వస్తుంటాయి. దేవాదాయ శాఖ అధికారిణి శాంతితో సంబంధం ఉన్నట్లు రూమర్స్ వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో నెగిటివ్ కోణంలో మరింత పాపులర్ అయ్యారనే చెప్పాలి. ఓన్లీ ఏపీ రాజకీయాలపై మాత్రమే కాకుండా భారత దేశ వ్యాప్తంగా విజయసాయిరెడ్డి తన గళం విప్పుతుంటారు. రీసెంట్ గా ట్విట్టర్ లో ఆయన బ్యాంక్స్‌లో మనీ డిపాజిట్లు బాగా తగ్గాయని, వడ్డీ రేట్లు ఎక్కువగా ఇవ్వాలని ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ని కోరారు. ఇంకా ఇలా చాలా విషయాలపై ఆయన మంచిగా రియాక్ట్ అవుతుంటారు.

వైసీపీ నేతకు ట్విట్టర్‌లో ఏకంగా 6,33,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒక పాపులర్ మూవీ హీరోకి సమానమైన ఫాలోయింగ్ ఆయన మెయింటైన్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో విపరీతంగా యాక్టివ్‌గా ఉండే విజయసాయి రెడ్డి ఫేస్‌బుక్‌లో మాత్రం కొద్దిగా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు. అయినా 3 లక్షల 50 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. విజయసాయి రెడ్డి ఫేస్‌బుక్ పేజీ ద్వారా అందరికీ బర్త్‌ డే విషెస్, మిగతా విషెస్ తెలియజేస్తుంటారు. విజయసాయి రెడ్డికి ఇన్‌స్టాగ్రామ్ లో 1.50 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో పెద్దగా ఆయన యాక్టివ్ గా ఉండరు. అయినా ఈ రేంజ్ లో ఫాలోవర్లు ఉండటం విశేషం. మొత్తం మీద విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా స్టార్ అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: