- జాతీయ యువ ఆదర్శ ఎమ్మెల్యేగా పురస్కారం.!
( ప్రకాశం - ఇండియాహెరాల్డ్ ) :
అయితే ప్రస్తుత సోషల్ మీడియా అనేది రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ నేతలు ఒక్క అసెంబ్లీలోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా లో యాక్టివ్గా ఉన్న నేతల్లో ఒకరు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు. నిత్యం ఫేస్ బుక్, 'X' లో అందుబాటులో ఉంటారు. అలాగే నియోజకవర్గంలో ప్రతి మండలం.. గ్రామాలు.. పార్టీ అనుబంధ సంఘాల వారీగా వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎప్పటికప్పుడు తన పర్యటనలు.. ప్రజా సమస్యల పరిష్కారం విషయాలు తెలియజేస్తూనే ఉంటారు.
స్థానికంగా లేదా జిల్లా వ్యాప్తంగా అయినా ప్రజల సమస్యల్ని తీర్చడానికి ఎపుడు ముందుంటారు. ఆయన 2018లో 'X' అకౌంట్ ద్వారా రాజకియంగా అలాగే వ్యక్తిగతంగా సేవలు అందించడానికి సిద్దమయ్యారు. ఆయనకు దాదాపు 10.5k కంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉండటం గమనార్హం.ముఖ్యంగా తాను ప్రజలకు చేసిన సేవలు, నందమూరి మరియు నారా ఫ్యామిలీ పై ఆయనకున్న ప్రేమానురాగాలు, టీడీపీ పార్టీ అమలు చేసిన ప్రతిపధకం గూర్చి ప్రజలలో తీసుకుపోడానికి ఆయనకు సోషల్ మీడియా అనేది ఒక అస్త్రంలాగా పనిచేసింది. నిత్యం సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండి జిల్లా వాసులకు కావలసిన అవసరాలు తీర్చడంలో ముందుంటారు.
స్థానికంగా,జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా తాను చేసిన లేదా టీడీపీ పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమాన్నైనా వెంటనే 'X' ద్వారా ప్రజలకు చేరవేయడంలో ముందుంటారు.అలాగే వైసీపీ ప్రభుత్వం చేసే అరాచక పనులను ప్రతి నిమిషం ప్రజలకు తెలియాలనే ఉద్దేశంలో భాగంగా కూడా ఆయనకు సోషల్ మీడియా బాగా కలిసిస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఆయన నిత్యం ప్రజలకు చేస్తున్న సేవను గమనించి ఢిల్లీ వేదికగా విజ్ఞాన్ భవన్లో ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ పదో సదస్సులో భాగంగా ఆయనను ఘనంగా సన్మానించి జాతీయ యువ ఆదర్శ ఎమ్మెల్యే పురస్కారం కూడా ఇచ్చారు.అయితే ఈ పురస్కారాన్ని ఆయన తనను రాజకీయాల్లో రాణించేలా తనను ఈ స్థాయికి తీసుకొచ్చినా తన నియోజకవర్గం ప్రజలకి ఈ పురస్కారం అంకితం చేశారు.