అదేంటి రాహుల్ గాంధీకి పెళ్లయిందా పిల్లలు కూడా ఉన్నారా ? ఇది నిజమా ఈ కొత్త పాయింట్ ఏంటి ? ఈ కొత్త ప్రచారం ఏంటి అనుకుంటున్నారా ?  మరి రాహుల్ కు పెళ్లి పిల్లలు ఈ స్టోరీ ఏంటో చూద్దాం. మామూలుగా బిజెపి నాయకుడు రఘువందన్ రావు మంచి వక్త .. మంచి లాయర్ కూడా .. లాజిక్కులు ... లా పాయింట్లు సరిగ్గా పట్టుకుని ఎదుటివాడికి ఛాన్స్ ఇవ్వకుండా దడ దడ లాడిస్తారు. పైగా మెదక్ ఎంపీ కూడా ... కానీ ఈ విషయంలో మాత్రం రఘునందన్ రావు వాదన భిన్నంగా ఉంది. తను సోనియాగాంధీ నివాసానికి వెళ్ళాడు ... ఓ ఇంగ్లీష్ పత్రికలో రాహుల్ గాంధీ రహస్య వివాహం ... పెళ్లికి సంబంధించిన కథనాలు వచ్చాయి అని అక్కడ సెక్యూరిటీ వాళ్లకు చెప్పాడట..


వాళ్లు నథింగ్ డూయింగ్ అనేసరికి ఆ కాపీలు వాళ్ళకి ఇచ్చేసి మీడియాలో ఏదేదో చెప్పాడు. ఇంత‌కు ?రఘునందన్ చెబుతోంది ఏంటంటే ? రాహుల్ బ్రహ్మచారి అని చెబుతున్నారు ... కానీ తనకు పెళ్లయింది పిల్లలు ఉన్నారు .. ఇదిగో పత్రికల్లో కథనాలు అని చెప్పటం ఆయన ఉద్దేశం. అయితే ఏమిటి ఎన్నికల అఫిడ‌విట్ లో వీటిలో తప్పు చెప్పాడు అంటారా ? మరి కేంద్ర ఎన్నికల సంఘానికి కదా ఈ విషయం చెప్పాల్సింది. ఇక సుబ్రహ్మణ్యస్వామి కూడా చాలా ఏళ్లుగా రాహుల్ కు బ్రిటన్ పౌరసత్వం ఉందని చెబుతున్నాడు.


అది ఇది కలిపి రఘునంద‌న్ రావు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వమే నిగ్గు తెలుస్తుంది కదా ... మ‌రి ఈ విష‌యం లో ప్రశ్నించవలసింది మోడీని - అమిత్ షాను కదా ... మరి సోనియా కుటుంబాన్ని ఆ పార్టీని ప్రశ్నిస్తే ఎలా ? అని కాంగ్రెస్ వాళ్లు అడుగుతున్నారు. ఓ ఇంగ్లీష్ దిన‌ప‌త్రిక‌ కథనాన్ని రఘునందన్ ఆధారంగా చేసుకున్నాడు కానీ దానికి సరైన ఆధారాలు లేవు. ఏదేదో కథ‌ అల్లినట్టుగా ఉంది అయినా సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు మీదే ఈరోజు వరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సరిగా స్పందించలేదు.. మరి రఘునందన్ చెబుతున్నట్టు రాహుల్ గాంధీ పెళ్లిళ్లు ... ప్రియురాలు పిల్లల కథలు చెప్తే ఎవరైనా నమ్ముతారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: