( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న మొదటి ప్రాధాన్యం. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయటం రెండో ప్రాధాన్యం. ఈ ఐదేళ్లలో అమరావతిని ఎలాగైనా పూర్తి చేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి మొత్తం రు. 60 వేల కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి నారాయణ చెప్పారు. తాజాగా కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ బిల్డర్లకు అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొస్తామని ప్రకటించారు. సింగల్ విండో అనుమతులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.


అమరావతి తో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణానికి మొత్తం రు. 60 వేల కోట్లు ఖర్చు అవుతుందని ... ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని ఆయన చెప్పారు. ఏది ఏమైనా రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితులలోనూ ఈ ఐదేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. అటు అమరావతి తో పాటు ... ఇటు ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి 2029 ఎన్నికలకు వెళ్లాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ టార్గెట్ గా కనిపిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా పూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది.


మరి చంద్రబాబు భగీరథ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఏది ఏమైనా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమరావతి పనులు అయితే వేగవంతం అయ్యాయి అన్నది నిజం. ఇప్ప‌టికే అమ‌రావ‌తి లో ఉన్న ముళ్ల కంప‌ల తొల‌గింపు ప్ర‌క్రియ అయితే స్పీడ్ గా జ‌రుగుతోంది. గ‌త ఐదేళ్ల‌లో పూర్తి గా మూత‌ప‌డిన అన్ని రియ‌ల్ ఎస్టేట్ ప్రాజెక్టులు.. భ‌వ‌నాలు ఇప్పుడు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. ఏదేమైనా అమ‌రావ‌తికి మ‌ళ్లీ కొత్త క‌ళ అయితే వ‌చ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: