- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .

ఇప్పుడు వైసీపీలో ఇదే హాట్‌ టాపిక్ గా కనిపిస్తోంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి బయటకు రాకుండా ఉంటేనే పార్టీకి మంచిదని పలువురు భావిస్తున్నారు. వైసిపి నేతలు కూడా జగన్ మరో ఏడాది ... రెండేళ్ల వరకు అసలు బయటకు రాకుండా ఉంటే మంచిదని జగన్ బయటకు వస్తే ఏం మాట్లాడతారో ?ఎలాంటి హావభావాలు ఇస్తారో ? అవి ప్రజల్లోకి ఎలాంటి చెడు సంకేతాలు పంపిస్తాయో అన్న భయంతో చ‌స్తున్నారు. తాజాగా ఎసిన్సియా కంపెనీ బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్ రెడ్డి వ్యవహార శైలి ... హావ భావాలు విచిత్రమైన ప్రకటనలు చూసి వైసిపి నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు.


తెలుగు రాజకీయాలలో తనకు మాత్రమే సాధ్యమైన ఓ బ్రాండెడ్ నవ్వును జగన్ బాధితులను చూసినప్పుడు నవ్వుతున్నారు. అసలు వాళ్లు బాధలో ఉంటే జగన్ అలా ఎందుకు ? నవ్వుతారో అక్కడ ఉన్నవారికి అర్థం కావడం లేదు. కనీసం అలాంటి చోటుకు వచ్చినప్పుడు గంభీరంగా ఉండే ప్రయత్నం చేయాలి ... అస‌లు జగన్కు అలాంటి సలహాలు పక్కనే ఉన్న నేతలు ఎందుకు ? ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. అప్పటికే పరిహారం పంపిణీ అయిపోతే ఆ విషయం తెలియదా ? తెలిసి కూడా అజ్ఞానంతో ఉంటున్నారో తెలియదు. కానీ పరిహారం ఇవ్వకపోతే ధర్నా చేస్తానని చెబుతున్నారు.


జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇప్పటికీ బాధితులు చాలామంది ఉన్నారు. వారికి చాలా వరకు పరిహారం అందలేదు. ఇక ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే తన ప్రభుత్వం వ‌చ్చిన తర్వాత ఇస్తానని చెప్పడంతో అక్కడ ఉన్న బాధితులు కూడా ఒక్కసారిగా అవ్వక్కు అవుతున్నారు. ఏది ఏమైనా జగన్ చర్యలు చూసి సొంత పార్టీ నేతలు వామ్మో ఇదేంటి రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జగన్ వీలైనంతవరకు ప్రజల్లోకి వెళ్ళకపోవడం మీడియాతో మాట్లాడకపోవడమే వైసీపీకి మంచిదని వారు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: