హైదరాబాదులోని హైటెక్ సిటీకి సమీపంలో మాదాపూర్ లో ఉన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై నిన్న హైడ్రా కొరడా జులిపింది. భారీ బందోబస్తు మధ్య తుమ్మిడి కుంట చెరువులోని భాగమైన దాదాపు మూడున్నర ఎకరాల స్థలంలో ఉన్న నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసింది.అయితే దీనిపై నాగార్జున స్పందించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ఆపాలంటూ హైకోర్టు స్టే ఇచ్చింది అని చెప్పారు. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, నాగార్జున హైకోర్టులో స్టే వచ్చింది అని పచ్చి అబద్ధం చెప్పారంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆయన మాట్లాడుతూ..చట్ట ప్రకారమే నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చేశాం.
ఈ కన్వెన్షన్ సెంటర్ పై ఎలాంటి స్టే తేలేదు. 

హైకోర్టులో స్టే ఇచ్చినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఎఫ్ టీ ఎల్ లో కట్టడాలు ఉన్నందునే ఈ నిర్మాణాన్ని కూల్చివేసాం..ఇందులో చాలా వరకు చెరువును కబ్జా చేసి చేసి కట్టారు. చట్ట ప్రకారమే హైడ్రా వ్యవహరించి అక్రమ కట్టడాలను కూల్చి వేసింది. కట్టడాలను మళ్ళీ క్రమబద్ధికరించుకోవడానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం వాళ్లు ప్రయత్నించారు.ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని గతంలోనే అధికారులు తిరస్కరించారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద ఇప్పటికే లోక యుక్త తో పాటు హైకోర్టు తీర్పులు ఉన్న పూర్తిగా అన్ని కట్టడాలను నేలమట్టం చేసాం. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ప్రస్తుతం జీరో గా మారింది. ఇక ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో ఎలాంటి క్వశ్చన్ లేదు..FTL లో కట్టడాలు ఉన్నందున చెరువుని కబ్జా చేసి కట్టడమే ఇందులో ఉన్న అసలైన కారణం.. ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు.అక్రమ నిర్మాణం కాబట్టే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చి వేసాము అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: