ఈ యేడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో బిజెపికి కొంత ఎదురుదెబ్బ తగిలింది. 2014 - 2019 ఎన్నికలతో పోలిస్తే అనుకున్న స్థాయిలో పూర్తి మెజార్టీ రాలేదు. మిత్రపక్షంలో సాయంతో మోడీ కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక త్వరలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు బిజెపిని భయపెడుతున్నాయట. పార్లమెంటు ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బలతో అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందా ? అని బిజెపి పెద్దలు కంగారుపడుతున్నారు జమ్మూ కాశ్మీర్ తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికి షెడ్యూల్ రిలీజ్ చేసింది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు అక్టోబర్ 4న వెలువ‌డ‌తాయి.

ఇక్కడ కాంగ్రెస్ - ఆప్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. హర్యానాలో 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికలలో ఏకంగా ఐదు స్థానాలు గెలుచుకుని పంచుకుంది. కాంగ్రెస్ ఓట్ల శాతం 20 నుంచి 43 శాతానికి పెరిగింది అంటే అక్కడ కాంగ్రెస్ తిరుగులేని పొజిషన్‌కు చేరుకుందని చెప్పాలి. హర్యానాలో రైతులదే గెలుపు ఓటములలో కీలక పాత్ర. బిజెపిపై రైతులలో ఎంత అసంతృప్తి ఉందో పార్లమెంటు ఎన్నికలు సాక్షిగా బయటపడింది. పైగా అక్కడ యువత ఎక్కువగా సైన్యంలోకి వెళుతూ ఉంటారు. అగ్ని వీర్‌ పథకంపై యువతలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది.


ఎప్పుడు ఎన్నికలు జరిగిన హర్యానాలో రైతు సమస్యలే హైలెట్ అవుతూ ఉంటాయి. ఇక సామాజిక సమీకరణలు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జాట్ ఓటును తేల్చేందుకు హర్యానా మాజీ ముఖ్యమంత్రి బ‌న్సీలాల్ కోడలు కిరణ్ చౌదరిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక కాంగ్రెస్ - జాట్ దళిత ఓటు బ్యాంకు పై ఆశలు పెట్టుకుంది. ఏది ఏమైనా హర్యానా ఎన్నికలలో బిజెపి విజయం సాధించకపోతే అది కేంద్రంలోని ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ హరియానాలో విజయం సాధించాలని బిజెపి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp