వైసీపీ అధినేత వైయస్ జగన్ రాజకీయ క్రీడలో ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు బలి పశువులు అయిపోయారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన పేరాడ తిలక్‌ను జగన్ మరోసారి బలి పశువును చేయబోతున్నారా.. అంటే అవుననే చెప్పాలి. 2019 ఎన్నికలలో జగన్ పేరాడ తిలక్‌ను టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా, దువ్వాడ శ్రీనును శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేయించగా.. ఇద్దరు ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే పేరాడ తిలక్‌కు షాక్ ఇచ్చిన జగన్.. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి ప‌గ్గాల నుంచి తప్పించారు. దువ్వాడ శ్రీనుకు టెక్కలి ఇన్చార్జి పగ్గాలు ఇవ్వడంతో పాటు.. ఏకంగా ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు.


తిలక్‌కు నామమాత్రంగా కలింగ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక ఈ ఎన్నికలలో శ్రీ‌నుకు టెక్కలి ఎమ్మెల్యే సీటు ఇవ్వగా.. తిలక్‌కు శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇచ్చా రు. ఈ ఎన్నికల్లోను ఇద్దరు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే.. ఎన్నికల్లో ఓటమి తర్వాత దువ్వాడ శ్రీను టెక్కలి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన కుటుంబం వివాదాల్లో చిక్కుకుంది. శ్రీను భార్య వాణి.. ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ పరువు బజారున పడుతుండడంతో.. జగన్ శ్రీనును టెక్కలి ఇన్చార్జి పగ్గాల నుంచి తప్పించి పేరాడ తిలక్ కు కట్టబెట్టారు.


తాజాగా జగన్ శ్రీనును తప్పించి తిరిగి తిలక్‌కు టెక్కలి పగ్గాలు ఇచ్చినా.. తిలక్‌కు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఈ ఐదేళ్లు తిలక్‌ను వాడుకొని.. వచ్చే ఎన్నికలు నాటికి జగన్ మరో వ్యక్తికి సీటు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఒకసారి టెక్కలి ఎమ్మెల్యేగా.. మరోసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు తిలక్. ఇప్పుడు టెక్కలిలో పార్టీ పరువు బజారున పడుతుందన్న ఉద్దేశంతో మాత్రమే తిలక్‌కు తిరిగి వైసిపి ఇన్చార్జ్ పగ్గాలు ఇచ్చారు తప్ప.. తిల‌క్ మీద జగన్‌కు ప్రత్యేకమైన ప్రేమ ఎంత మాత్రం ఉండదు. ఏది ఏమైనా తిలక్‌ను కూడా అవసరం ఉన్నన్ని రోజులు వాడుకుని జగన్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారని వైసీపీ వాళ్ళే చెవులు కోరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: