ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో బిజెపి పార్టీ నుంచి  నిలబడిన అభ్యర్థులు  ప్రతి చోట కూడా గెలిచారు.. అలా రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి మంచి విజయాన్ని అందుకుంది ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షరాలు  దగ్గుబాటి పురందేశ్వరి. తాజా మరొక్కసారి ఇమే మానవత్వం చాటుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే రాజమహేంద్రవరంలో పయనిస్తూ ఉండగా మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనను చూసి వాహనాన్ని మరి ఆపి ఆ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని వెంటనే పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో క్షతగాత్రులను సైతం ఆసుపత్రికి తరలించే విధంగా ఆదేశాలను జారీ చేసింది ఎంపీ పురందేశ్వరి.


అంతేకాకుండా దగ్గరుండి మరి ఈ పని చేసే వరకు అక్కడి నుంచి కదలలేదట. అనంతరం అత్యవసర చికిత్స విభాగానికి సైతం క్షతగాత్రులను పంపించే వరకు అక్కడే ఉందట. అలాగే వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించిందట. ఇలా రోడ్డుమీద గాయపడిన వ్యక్తిని మానవత్వంతో తన వాహనంలోనే హాస్పిటల్ కు తరలించిన ఎంపీని సైతం చూసి పలువురు ప్రజలు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా వెళుతున్న పురందేశ్వరి ఈ ప్రమాదాన్ని చూసి చలించిపోయినట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలు అవ్వడంతో వెంటనే కారు నుంచి దిగి బాధితురాలతో స్వయంగా ఆమె మాట్లాడి అనంతరం దగ్గరలో ఉండే ఆసుపత్రికి చేర్పించారట.అందుకు సంబంధించి ట్విట్టర్లో ఒక పోస్టును కూడా షేర్ చేయడం జరిగింది. బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ హవా చూపించాలనే విధంగా ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది కానీ సింగిల్ గా పోటీ చేసిన మెజారిటీ గెలవలేక పోతూ ఉండడంతో కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని మరి పోటీ చేసింది. రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ హవ మరింత పెరుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: