ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదం విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ వివాదం విషయంలో మీమర్స్ నాగార్జునను దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ చెరువులలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకింత సంచలం అయింది. అయితే రేవంత్ సర్కార్ ప్రతిపక్ష పార్టీల నేతల భవనాలను టార్గెట్ చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
అయితే సీపీఐ నారాయణ ఎన్ కన్వెన్షన్ వివాదం గురించి స్పందిస్తూ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగార్జున మంచి నటుడే కావచ్చని అంత మాత్రాన కక్కుర్తి ఎందుకని సీపీఐ నారాయణ అన్నారు. సినిమా డైలాగ్స్ ను చెప్పడం కాదని బుకాయింపులు సరికాదని సీపీఐ నారాయణ హితవు పలికారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అక్రమం అని ప్రూవ్ అయితే తానే కూల్చేస్తానంటూ నాగ్ చేసిన కామెంట్లపై నారాయణ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.
 
ఇన్ని సంవత్సరాలు నాగార్జున అక్రమ నిర్మాణాన్ని అనుభవించినందుకు పరిహారం చెల్లించాలంటూ నారాయణ డిమాండ్ చేయడం గమనార్హం. బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం గతంలో ఈ నిర్మాణం విషయంలో మొదట యాక్టివ్ గా వ్యవహరించి ఆ తర్వాత సైలెంట్ అయిందని నారాయణ పేర్కొన్నారు. కొంతమంది బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు పతివ్రత మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
 
హైదరాబాద్ నగరంలో ఎం.ఐ.ఎం. వాళ్లు ఆక్రమించిన స్థాయిలో ఎవరూ ఆక్రమించలేదని నారాయణ తెలిపారు. అయితే నాగార్జున మాత్రం వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని అభిమానులకు సూచించారు. కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటానని అవాస్తవాలను నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. తాము ఒక్క సెంట్ కూడా ఆక్రమించలేదని నాగార్జున మరోసారి స్పష్టం చేశారు. నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించామని ఆయన చెప్పుకొచ్చారు. చెరువు ఆక్రమణకు గురి కాలేదని గతంలోనే స్పెషల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని నాగార్జున పేర్కొన్నారు.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: