తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ఇప్పుడు సంచలనంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువలు ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. దీంతో ఏ వైపు నుంచి బుల్డోజర్లు దూసుకొస్తాయో తెలియక కొందరు అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. స్థానిక అధికారులకు సైతం సమాచారం ఇవ్వకుండా హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నారు. భారీ బందోబస్తు, పకడ్బందీగా హైడ్రా అధికారులు కూల్చివేతల పని కానిచ్చేస్తున్నారు. శనివారం (ఆగస్టు 24) నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు.చెరువులు, నాలాల కబ్జా జరిగిందనే ఫిర్యాదు అందితే చాలా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రికార్డులు బయటికి తీస్తూ.... అసలు విషయాలను బట్టబయలు చేసే పనిలో పడింది. ప్రభుత్వం కల్పించిన విస్తృత అధికారాలతో అక్రమ నిర్మాణాలను బుల్డోజ్ చేసేస్తోంది.సామాన్యులు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా 'హైడ్రా' కఠినంగా వ్యవహారిస్తోందనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. శనివారం టాలీవుడ్ హీరో అఖినేని నాగార్జునకు చెందిన ఎన్ - కన్వెన్షన్ ను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసింది.

ఈ నిర్మాణంపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అందినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. తాజాగా హైడ్రాకు ఫిర్యాదు అందటంతో... నేరుగా సీన్ లోకి వెళ్లింది. గంటల వ్యవధిలోనే అక్రమణకు గురైన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసేసింది. ఈ చర్యలతో 'హైడ్రా'పై డిస్కషన్ మరో లెవల్ కి వెళ్లిపోయింది.చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్లు కట్టుకున్నారని… వారంతా డ్రైనేజీని చెరువుల్లో కలుపుతున్నారని అన్నారు. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష సాధించటం కోసమో కూల్చివేతలు చేయడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే తాను ప్రజా ప్రతినిధిగా విఫలమైనట్లే అని కామెంట్స్ చేశారు.ఇదిలావుండగా హైడ్రా కూల్చివేతల నేపథ్యం లో సీఎం రేవంత్ పై బిజెపి ఎంపీ ఈటెల ఫైర్ అయ్యారు. నాలుగు రోజుల నుంచి రేవంత్ హీరోలా హై డ్రామా చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే దమ్ము లేక ఈ పని పెట్టుకున్నారు. చట్టాన్ని పక్కన పెట్టి నీ తాత జాగిరుల,నువ్వేదో హీరోలా, నీ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా,ధర్మం కోసమే ఉన్నట్టుగా, ఫోజులు కొట్టడం సరికాదు.పెద్దల అక్రమ నిర్మాణాలు కూలిస్తే మంచిదే కానీ పేదలపై ప్రతాపమా? అని ప్రశ్నించారు.  మరిఈ విషయంపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: