ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. ఆక్రమిత కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా వణుకు పుట్టిస్తుండటం ఒకింత సంచలనం అవుతోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ హైడ్రా వార్తల్లో నిలిచింది. హైడ్రా పేరు వింటే అక్రమార్కులు గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది.
 
మొత్తం 18 ప్రాంతాలలో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా వెల్లడించింది. మొత్తం 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్టు హైడ్రా తెలపడం గమనార్హం. అయితే ఏపీకి కూడా హైడ్రా అవసరమని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీకి హైడ్రా వస్తే ఆక్రమణకు గురైన చెరువులను కూల్చి వేసి ప్రజలకు మంచి చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
 
ఏపీలో పార్టీలతో సంబంధం లేకుండా చాలామంది రాజకీయ నేతలు అక్రమ నిర్మాణాలను చేపట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పేర్లు అనవసరం కానీ ఈ తరహా ఆక్రమణలకు సంబంధించిన కేసులు ఏపీలో తరచూ వినిపిస్తుండటం గమనార్హం. చంద్రబాబు ఈ దిశగా అడుగులు వేస్తే ఆయన ఇమేజ్ సైతం ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
అందరిపై కొరడా ఝళిపిస్తే ప్రజలకు లాభం కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు శిష్యుడిని ఫాలో అవుతారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏపీలోకి హైడ్రా వస్తే మాత్రం ఏపీ రాజకీయాలు మరింత సంచలనం అవుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తెలంగాణ తరహా రాజకీయాలు ఏపీలో జరుగుతయో లేదో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు సైతం ప్రజల్లో మంచి పేరు వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. చంద్రబాబు ఇప్పటివరకు అమలు చేసిన పథకాలపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం


మరింత సమాచారం తెలుసుకోండి: