టీటీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన బాబు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచనలు చేయడం గమనార్హం. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీ అందరినీ కలవడానికి వచ్చానని తెలుగు ప్రజలు 45 ఏళ్లగా నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేశారని అందుకు తగినట్లే నిరంతరం ప్రజలకు సేవ చేస్తోందని బాబు వెల్లడించారు. టీటీడీపీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నామని హడ్‌హాక్ కమిటీలు రద్దు చేశామని కొత్త కమిటీలు వేస్తామని ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు కామెంట్లు చేశారు. పార్టీలో యువ రక్తానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వారిని ప్రోత్సహిస్తామని బాబు పేర్కొన్నారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, రాక్షస పాలనను అంతమొందించి రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగాలని నన్ను గెలిపించిన ఏపీ ప్రజలకు న్యాయం చేయడం తన లక్ష్యాలని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి తెలంగాణకు వస్తానని ఆయన కామెంట్లు చేశారు. మీ అందరి అభిప్రాయాలు తీసుకుని అందరి నిర్ణయాల మేరకే పార్టీలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. చంద్రబాబు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాబోయే రోజుల్లో ఏ పార్టీకి నష్టం కలుగుతుందో చూడాల్సి ఉంది. చంద్రబాబుకు తెలంగాణలో సైతం విజయం దక్కాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.