ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనీ మట్టిగుంట గ్రామంలో పాలపర్తి డేవిడ్ రాజు 1958 మే 7 వ తేదీన జన్మించారు.వెళితే ..ఈయన ఎంఏ, ఎల్.ఎల్.బి వంటివి పూర్తి చేశారట. నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాదులో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. ఈయన ప్రస్తుత వయసు 66 సంవత్సరాలు అన్నట్లుగా అసలు తెలుస్తోంది.. అసలు  విషయంలోకి వెళితే  1987లో టిడిపి పార్టీ ద్వారా రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. మొదట ఎంపీటీసీగా, జడ్పిటిసి గా గెలిచిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశారట.1999 లో మొట్టమొదటిసారిగా సంతనూతలపాడు నియోజవర్గం నుంచి  టిడిపి  ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2009లో  మళ్లీ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేయగా ఓడిపోవడం జరిగిందట.


ఆ తర్వాత మళ్లీ 2010లో వైసీపీ పార్టీలోకి చేరి 2014 నుంచి వైసీపీ పార్టీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. అలా గెలిచిన తర్వాత రెండేళ్లకు టిడిపిలో చేరి మళ్ళీ తిరిగి వైసిపి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత రాజకీయాలకు దూరంగా ఉన్నారని సమాచారం. దీంతో అటు మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు మృతి పట్ల ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపాన్ని సైతం తెలియజేస్తున్నారు.


వీరి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నారు. వీటితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ప్రకాశం జిల్లాకి చెందిన పలువురు నేతలు కూడా డేవిడ్ రాజు మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నారు. శాసన సభ్యులుగా అక్కడ ప్రజలకు సైతం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సైతం పరిష్కరించడానికి ఆయన ఎక్కువగా కృషి చేస్తారని అక్కడ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ ప్రజలు కూడా ఈయన చేసిన సేవలను మర్చిపోలేమంటూ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: