* రాజకీయాల్లో అసలు సిసలైన నటులు

* వారిచ్చే ట్విస్టులకి ప్రజలకు మతిపోతుంది

* బెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వారిలో ఒకరు

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

రాజకీయాల్లో చాలా గొప్ప నటులు ఉంటారని స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఉదాహరణకు విడదల రజినీ "చంద్రబాబు నాటిన మొక్కని నేను.. చంద్రబాబు నాకు దేవుడు" అంటూ చాలా ఎమోషనల్ డైలాగ్స్ వదిలింది. తర్వాత మాత్రం వైసీపీ పార్టీలోకి వెళ్లిపోయి బాబుకు భారీ షాక్ ఇచ్చింది. అంతే కాదు జగనే దేవుడు చంద్రబాబు ద్రోహి అంటూ ప్లేట్ పిరాయించింది. మహానటి అంటూ ఆమెను చాలా మంది ట్రోల్ కూడా చేశారు. ఆమె ఒక్కరే కాదు, ఏపీలో ఇంకా ఇలాంటి గ్రేట్ యాక్టర్స్ చాలామందే ఉన్నారు. వీళ్లు తమ కట్ట కాలే వరకు ఒకే పార్టీలో ఉంటామని చెప్పారు కానీ తర్వాత వేరే పార్టీలోకి ఏమాత్రం మొహమాటం లేకుండా వెళ్లిపోయారు.

అలాంటి వారిలో వెలంపల్లి శ్రీనివాసరావు ఒకరు. ఈయన చాలా సందర్భాల్లో చనిపోయేంతవరకు ఒకే పార్టీలో ఉంటానని ఎన్నో పెద్ద మాటలు చెబుతుంటారు. కానీ తర్వాత ఆ మాటలు అన్నది తనేనా అనుకుంటారు. ఆపై వేరే పార్టీలో జాయిన్ అయిపోతారు. వెలంపల్లి శ్రీనివాస్‌ 2009లో మొదటగా ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అదే పార్టీ తరఫున 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంటెస్ట్ చేశారు. అందులో విజయం సాధించడంతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయారు. 'బీజేపీలోనే ఉంటా ఇక ఏ పార్టీ మారాను' అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతూ వచ్చారు కానీ తర్వాత మారిపోయారు. 2016లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో వెలంపల్లి శ్రీనివాసరావు బోండా ఉమామహేశ్వరరావు పై దాదాపు 69 వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. మరి ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి మారతారో ఆసక్తికరంగా మారింది. టీడీపీలో మారినా మారొచ్చు అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే విజయం సాధించడం కోసం గతంలో ఆయనకు రెండు పార్టీలు మారిన చరిత్ర ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: