ఏపీ రాజకీయాల్లో కొన్ని నెలల క్రితం వరకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేతలలో వలభనేని వంశీ ఒకరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా వల్లభనేని వంశీకి పేరుంది. గన్నవరం నియోజకవర్గంలో రెండుసార్లు టీడీపీ తరపున ఎన్నికైన వల్లభనేని వంశీకి ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం భారీ షాకిచ్చాయి. గతంలో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన వంశీ ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
 
రెండోసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో చంద్రబాబు, లోకేశ్ లపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా వల్లభనేని వంశీ అందరికీ శత్రువయ్యారు. తర్వాత రోజుల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరడం ద్వారా ఆయన ప్రజల నమ్మకాన్ని సైతం కోల్పోయారు. టీడీపీకి తీరని ద్రోహం చేసిన వల్లభనేని వంశీ భవిష్యత్తులో టీడీపీలో తిరిగి చేరే అవకాశం కూడా లేనట్టేనని తెలుస్తోంది.
 
నైతిక విలువలు లేకుండా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడంతో పాటు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఏ71 కింద ఆయన పేరు నమోదైంది. ఈ కేసులో వంశీ అనుచరులు పట్టుబడుతుండగా వంశీ అమెరికాకు వెళ్లిపోయారని కూడా ప్రచారం జరుగుతోంది. త్వరలో గన్నవరంకు వస్తానని వంశీ అనుచరులకు సందేహం ఇచ్చారని సమాచారం అందుతోంది.
 
ముఖ్య అనుచరులకు మాత్రమే వంశీ టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా రాబోయే రోజుల్లో కూడా ఆయనకు ఊహించని స్థాయిలో ఇబ్బందులు తప్పవని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వినిపిస్తుండటం కొసమెరుపు. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉండటంతో ఆ పార్టీని నమ్ముకున్న నేతలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అని చెప్పుకుని తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని అభిప్రాయాలు వ్యక్తమవుతునాయి.  వల్లభనేని వంశీపై నమోదైన కేసుల విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: