ఏపీ రాజకీయాలలో బూతులు మాట్లాడి పాపులర్ అయిన నేతలలో కొడాలి నాని ముందువరసలో ఉంటారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన నాని తర్వాత రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారిన పరిణామాల వల్ల 2012 సంవత్సరంలో వైసీపీలో చేరారు. అయితే ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉన్నా గుడివాడ నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నా ఆయన మాట్లాడే తీరును మాత్రం మెజారిటీ ప్రజలు హర్షించారు.
 
కొడాలి నాని మాట్లాడిన బూతు డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడో ఒకచోట వినిపిస్తూ ఉంటాయి. 2024 ఎన్నికల ముందు వరకు పులిలా గర్జించిన కొడాలి నాని ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మీడియా ముందుకు కొడాలి నాని వస్తున్నా మరీ ఘాటుగా అయితే రియాక్ట్ కావడం లేదు. ఒకప్పుడు టీడీపీలో ఉండి ఇప్పుడు వైసీపీ నేతగా కొనసాగుతున్న కొడాలి పార్టీ మారినందుకు ఫలితం అనుభవిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నానిపై పలు కేసులు సైతం నమోదు కావడం గమనార్హం. సాంబ సినిమాకు కొడాలి నాని నిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది. కొడాలి నాని వయస్సు ప్రస్తుతం 52 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఐదేళ్ల తర్వాత కొడాలి నాని పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. ఆ సమయానికి ఏపీలో పొలిటికల్ పరిస్థితులు కూడా మారతాయని చెప్పవచ్చు.
 
కొడాలి నాని బూతులు మాట్లాడకుండా ఉంటే ఆయన పరిస్థితి మరో విధంగా ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కొడాలి నాని రాజకీయాల్లో మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కొడాలి నాని పొలిటికల్ గా యాక్టివ్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటుండగా ఆయన పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. కొడాలి కొన్ని విషయాలలో తన తీరును మార్చుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: