* 1994లో CPM నుంచి విజయం
* 2004లో CPM నుంచి టీడీపీలోకి జంప్
* 2009లో సత్తుపల్లి నుంచి టీడీపీ ఎమ్యెల్యేగా విజయం
* 2018లో టీడీపీ నుంచి గులాబీ గూటికి
 

రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకులు ఉండగా... అందులో చాలామంది పార్టీలు మారుతూ ఉన్నారు. రాజకీయ అవసరాల కోసం.. కొంతమంది పార్టీలు మారుతూ ఉంటారు. అలాంటి వారిలో సండ్ర వెంకట వీరయ్య కూడా ఉన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకట వీరయ్య...ఇప్పటివరకు మూడు పార్టీలు మారి...చరిత్ర సృష్టించారు.

సండ్ర వెంకట వీరయ్య... కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ కు చెందిన  కీలక రాజకీయ నాయకులు. సిపిఎం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు సండ్ర వెంకట వీరయ్య. 1994 సంవత్సరంలో సిపిఎం పార్టీ తరఫున పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించారు. అయితే 2004 సంవత్సరాని కంటే ముందు సిపిఎం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు సండ్ర వెంకట వీరయ్య.

 ఇక అప్పటి నుంచి పాలేరు..నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలక నేతగా ఎదిగారు సండ్ర వెంకట వీరయ్య. 2009 సంవత్సరంలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా కూడా సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించడం జరిగింది. 2014లో కూడా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

 టీటీడీ పార్టీ సభ్యులుగా కూడా మూడుసార్లు ఎన్నికయ్యారు సండ్ర వెంకట వీరయ్య. అయితే 2018 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి.. రాజకీయ అవసరాల నేపథ్యంలో  గులాబీ పార్టీలో చేరిపోయారు సండ్ర వెంకట వీరయ్య. అయితే మొన్న 2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాదు ఓటుకు నోటు కేసులో...  కీలక వ్యక్తిగా కూడా వెంకట వీరయ్య పై ఆరోపణలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: