రాజకీయ నాయకులు ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఉన్నారు. ఒక పార్టీ కండువా కప్పుకోగానే ఆ పార్టీలోనే చివరి వరకు ఉంటాము అని , ఆ పార్టీ అధినేత చెప్పిన మాటలను వింటూ ప్రజలకు ఎంతో బాగు చేస్తాము అని మాటలు చెప్పి మళ్ళీ వెంటనే పార్టీని మారిన నేతలు ఎంతో మంది ఉన్నారు. ఇక కొంత మంది పార్టీలు మారడానికి ప్రధాన కారణం ఆ పార్టీలో వారికి మంచి స్థానం దక్కకపోవడం , ఇక వారి మాటకు విలువ లేకపోవడం. ఇలా అనేక కారణాల వల్ల కొంత మంది పార్టీలు మారుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో మంచి గుర్తింపు కలిగిన రాజకీయ నాయకులలో గడ్డం వివేక్ ఒకరు.

ఈయన తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  2009 లో పెద్దపల్లి లోక్‌ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీ గా గెలిచి పార్లమెంట్ బొగ్గు , ఉక్కు కమిటీల సభ్యుడిగా ఉన్నాడు. వివేకానంద్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2 జూన్‌ 2013 న కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరాడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వివేకానంద్ 2014 మార్చి 31 న తిరిగి కాంగ్రెస్‌ లో చేరాడు. 

ఆయన 2014 లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. వివేక్.ఆ తర్వాత 2016 లో టీఆర్‌ఎస్‌ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితుడయ్యాడు. వివేక్ 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ తరపున టికెట్ ను ఆశించాడు. కానీ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ కి 2019 మార్చి 25 వ తేదీన రాజీనామా చేశాడు. ఆయన 2019 ఆగస్టు 9 న (బీజేపీ) భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన 2021 అక్టోబరు 7 న భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా నియమితుడయ్యాడు.

వివేక్ వెంకట స్వామి 2023 అక్టోబరు 5 న  బిజెపి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కూడా నియమితులయ్యాడు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం పట్ల అసంతృప్తి తో ఉన్న ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తూ నవంబరు 01 న తన రాజీనామా లేఖని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించాడు. ఇక ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందాడు. ప్రస్తుతం వివేక్ పెద్దపల్లి ఎంపీగా ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత అనేక పార్టీలలో చేరిన వివేక్ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: