* ఆనాడు జగన్ ను హంతకుడు అన్న బొత్స.. నేడు జగన్ కు వీరాభిమాని

* పదవి లేకుండా పది నిముషాలు కూడా ఉండలేని పరిస్థితి

* తండ్రిని అవమానించిన జగన్ అందలమెక్కించడానికి కారణం అదేనా?


వైసీపీ పార్టీలో సీనియర్ నేతగా వున్న బొత్స సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఉండి పీసిసి చీఫ్ గా కీలక బాధ్యతలు చేపట్టారు..బలమైన ప్రజా మద్దతుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.. ఎలాంటి వివాదాన్నినైనా సామరస్యంగా పరిష్కరించగల లీడర్ గా బొత్స గుర్తింపు పొందారు.బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితం విద్యార్థి దశ నుండే ప్రారంభం అయింది . 1978లో విద్యార్థి సంఘ నాయకుడుగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి బొత్స అంచలంచలుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ గా ఎదిగారు. ఆయన 1992 నుంచి 99 వరకు రెండుసార్లు విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్  పని చేసారు.. ఆ తరువాత 1996లో బొబ్బిలి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా క్రుంగిపోకుండా పట్టుదలతో పని చేసారు..1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. ఆనాడు ఎన్డీఏ హవా కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ నుండి కేవలం 5 ఎంపీలని మాత్రమే గెలుచుకోగా అందులో బొత్స ఒకరిగా నిలిచారు. ఇక బొత్స సత్యనారాయణ . 2004, 2009 లలో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత బొత్స పేరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి కూడా వచ్చింది.ఆయన వైఎస్ఆర్, రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2012 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బొత్స ప్రతి పక్షాలపై పవర్ ఫుల్ స్పీచ్ తో విరుచుకుపడేవారు.. గతంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆయనతో పాటు చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి జగన్ పెట్టిన పార్టీలో చేరారు. దీనితో ఉప ఎన్నికలు మొదలయ్యాయి. ఉప ఎన్నికల్లో వైసీపీ 18 కి పైగా స్థానాలు సాధించింది. ఆనాడు ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి గెలిచిన విజయమ్మ కాంగ్రెస్ పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.. కాంగ్రెస్ కి నా భర్త వై యస్ రాజశేఖర్ రెడ్డి, బిడ్డ జగన్ మోహన్ రెడ్డి ఎంతో సేవలు చేసారు. కాంగ్రెస్ కోసం అహర్నిశలు పని చేసిన వారిపై అక్రమంగా కేసులు పెట్టించారు.పొమ్మనలేక పొగబెట్టి జగన్ ను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసారు.కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పని చేయడమే వారి తప్పా అని ఆమె ప్రశ్నించారు.


దీనికి కౌంటర్ గా జగన్, విజయమ్మ పై బొత్స అసెంబ్లీ లో విరుచుకుపడ్డారు.వైఎస్ఆర్ కు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవం ఇచ్చింది.. ఆయన నాయకత్వంలో పార్టీ ఓడినా, గెలిచినా వైఎస్ఆర్ కే ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన చనిపోయాక జగన్ తమ కుటుంబమే ఆ సిఎం సీటులో ఉండాలనే దురుద్దేశంతో వున్నారు.. ఆయన చేసిన పనులే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేశాయని బొత్స అన్నారు..ఇలా కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా వున్న బొత్స రాష్ట్రం రెండుగా విడిపోవడంతో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా పడిపోవడంతో 2015 కాంగ్రెస్ కి రాజీనామా చేసి తాను తీవ్రంగా విమర్శించిన జగన్ పార్టీలో చేరారు. జగన్ ను  విమర్శించిన బొత్స పార్టీలో చేరాక జగన్ గొప్పతనాన్ని కొనియాడారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాక మున్సిపల్ శాఖ, విద్యా శాఖ మంత్రిగా బొత్స బాధ్యతలు చేపట్టారు.. తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందింది. బొత్స కూడా సొంత నియోజకవర్గంలో ఒడిపోయారు..బొత్స ఓడినా కూడా జగన్ ఆయనకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: