* ఫైర్ బ్రాండ్ గా రాజకీయాల్లో మంచి పేరు..
* పార్టీలు మారుతూ రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకున్న వైనం
* తెలంగాణ రాజకీయాల్లో కనుమరుగైన విజయశాంతి



రాజకీయాలు అన్న తర్వాత జంపింగ్లు కామన్. కొన్ని కొన్ని సార్లు అయితే రాజకీయ నాయకుల ముందు సినిమా నటులు అస్సలు పనికిరారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీలో కొనసాగినప్పుడు ఆ పార్టీనే తమ ప్రాణమని.. ఏకంగా తమ రక్తంలోని ప్రతి బొట్టులో కూడా ఆ పార్టీ పేరే కనిపిస్తూ ఉంటుందని చెప్పే రాజకీయ నాయకులు ఇక తర్వాత మాత్రం అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ అవ్వడానికి ఏమాత్రం వెనక ముందు ఆలోచించరు. కార్యకర్తల గురించి వెన్నంటే నడిచి గెలిపించిన నాయకుల గురించి అస్సలు పట్టించుకోరు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో జంపింగ్ జపంగ్ లు కాస్త ఎక్కువగానే ఉన్నారూ అని చెప్పాలి.


  తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం తరచూ పార్టీలు మారుతూ.. ఇక మారిన పార్టీలో సైతం సముచిత గౌరవం దక్కించుకుంటూ పదవులు అనుభవిస్తున్న వారూ కొంతమంది.. అయితే చివరికి తరచూ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగులు చేస్తూ రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకున్నవారు ఇంకొంతమంది. ఇలాంటి కోవలోకే వస్తారు సినీనటి రాజకీయ నాయకురాలు విజయశాంతి. సినీనటిగా ఆమెకు తిరుగులేదు. ఎంతో మంది హీరోల సరసన నటించడమే కాదు.  లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి తెలుగు ప్రజల గుండెల్లో రాములమ్మగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అలాంటి విజయశాంతి ఇక 1998లో బిజెపి పార్టీలో చేరి రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టింది ఆమె.


 తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005లో ప్రత్యేకంగా ఒక పార్టీని కూడా ఏర్పాటు చేసింది. తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటుచేసినా.. ఇక ఆ పార్టీ తరఫున సక్సెస్ కాలేకపోయింది. ఇంకేముంది తల్లి తెలంగాణ పార్టీని 2009లో టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది. ఇక 2009 పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే విజయం సాధించింది. కానీ ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో కానీ 2013 నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటూ వచ్చింది. ఇంకేముంది ఆమెను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి. ఇక హస్తం పార్టీలోనూ ఇమడలేకపోయింది. కాంగ్రెస్ తరపున 2014 ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైంది. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకలాపాలకు  దూరంగా ఉన్న విజయశాంతి 2020లో భారతీయ జనతా పార్టీలో చేరింది. ఈ పార్టీలోనైనా సవ్యంగా ఉంటుందనుకుంటే చివరికి మళ్ళీ బిజెపికి రాజీనామా చేసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరింది. అయితే గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఎక్కడ ప్రచారంలో కనిపించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేస్తారు అని అందరూ అనుకున్నారు. ఇలా పార్టీలు మారుతూ చివరికి తన రాజకీయ భవిష్యత్తునే పాడు చేసుకుంది విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి: