తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్... పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. బీసీల కోసం తన పోరాటం ప్రారంభించినట్లు తెలిపారు తీన్మార్ మల్లన్న. బీసీలకు గెలిపించుకునేందుకు... తాను అవసరమైతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలుస్తానని తెలిపారు తీన్మార్ మల్లన్న.

 

తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం రాబో తుందని కూడా తీన్మార్ మల్లన్న వెల్లడించడం జరిగింది. బీసీల అండదండలతోనే... తాను విజయం సాధించానని తీన్మార్ మల్లన్న చెప్పారు. తాను ఓడి పోతానని తెలంగాణ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్రెడ్డి... అమెరికా నుంచి ఫోన్ చేశారని కూడా గు ర్తు చేశారు తీన్మార్ మల్లన్న. కానీ తనకు బీసీలు చాలా అండగా నిలిచారని కూడా గుర్తు చేశారు.

 తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజానికి 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్న. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలుచేసి తీరాల్సిందేనని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం లో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అందరినీ ఏకం చేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు తీన్మార్ మల్లన్న.

తెలంగాణ బీసీలకు అన్యాయం జరిగితే... తొక్కి పట్టి నార తీస్తానన్నారు.  తెలంగాణ బడ్జె ట్లో బీసీ సమాజానికి 9000 కోట్లు మాత్రమే కేటాయించడంపై నిప్పులు చెరిగారు. బిచ్చగాళ్ళలో కుల సంఘాలకు 50 కోట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. అయితే తీన్మార్ మల్లన్న... కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా... ఇలా మాట్లాడడంతో ఆయన కెసిఆర్ టచ్ లోకి వెళ్లినట్లు కొంతమంది భావిస్తున్నారు. ఆయనతో త్వరలోనే పనిచేయ బోతున్నారని కూడా  కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: