చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ కట్టినట్టుగా తనపై ఆరోపణలు వస్తున్నందుకు స్పందిస్తున్నానని తమ ఎన్ క‌న్వెన్షన్ పూర్తిగా చట్టబద్ధమైనదని .. ఒక గజం కూడా చెరువు స్థలం కబ్జా చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కినేని నాగార్జున అలాగే దీనిపై తాను కోర్టుకు వెళుతున్నానని చట్టపరంగానే పోరాటం చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. గతంలో నోటీసు ఇచ్చారని దానిపై హైకోర్టు స్టే ఇచ్చిందని చట్ట విరుద్ధంగా తన కన్వెన్షన్ ను అధికారులు కూలగోట్టారని కూడా నాగార్జున ఆరోపించిన సంగతి తెలిసిందే. నాగార్జున తాను ఎంతో నీతిమంతుడిని అధికారులు తప్పు చేశారు అని చెప్పేందుకు చేసిన ప్రయత్నం పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. దాదాపు పది సంవత్సరాల నుంచి ఎన్ క‌న్వెన్ష‌న్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.


అది పూర్తిగా అక్ర‌మ‌ కట్టడం అన్న విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే దానిని పడగొట్టేందుకు బుల్డోజర్లను కూడా పంపారు. ఏమైందో వెంటనే అవి వెనక్కు వచ్చేసాయి. తెరవెనక ఏం ? జరిగిందో అందరికీ తెలుసు. తాజాగా కూల్చివేతలపై హైడ్రా స్పష్టమైన ప్రకటన ఇచ్చింది. ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేయవద్దని స్టే ఎక్కడా లేదని కూడా తెలిపింది. మూడున్నర ఎకరాలను కబ్జా చేశారని ఈ కన్వెన్షన్ లో ఏ ఒక్క భవనానికి పర్మిషన్ లేదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. హైడ్రో అధికారులు క్లారిటీ ఇవ్వడంతో నాగార్జున పచ్చి అబద్దాలు చెప్పారని స్పష్టమైంది.


నాగార్జున చెరువులోనే ఎం కన్వెన్షన్ కట్టారని అందరికీ తెలుసు దానికి రికార్డు చూడాల్సిన అవసరం కూడా లేదు. చెరువులో భాగమైన కన్వెన్షన్ చూస్తే అర్థమవుతుంది. అయినా నాగార్జున బుకాయించే ప్రయత్నం చేశారు. విచిత్రమింటంటే నాగర్జునపై సానుభూతి చూపించేందుకు ఒక్కరంటే ఒక్క నేత కూడా ముందుకు రాలేదు.. చివరికి బిజెపి నేతలు కూడా ఇంతకాలం ఎందుకు ? ఆగారన్న ప్రశ్నలు వేశారు. బిఆర్ఎస్ నేతలు కూడా సమర్థించలేదు. చాలామంది దీనిని కూల్చి వేయ‌డం కరెక్ట్ అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. ఏది ఏమైనా ఇప్పుడు నాగార్జున స్పందించడం వల్ల ఆయన కబ్జాదారుడు కాదు అని జనం అనుకునే పరిస్థితి లేకపోగా... అబద్ధాలు కూడా ఆడుతున్నారని అపవాదు మూటగట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: