వైసిపి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇష్టం వచ్చినట్టు ప్రత్యర్థులపై రెచ్చిపోయేవారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పదేపదే టార్గెట్ చేస్తూ అనిల్ కుమార్ యాదవ్ తీవ్రమైన విమర్శలు చేసేవారు. జగన్ కూడా ఎంకరేజ్ చేయడంతో అనిల్ నోటికి అడ్డు అదుపు లేకుండా పోయేది. ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. అలాంటి అనిల్ కు జగన్ మూడేళ్ల తర్వాత అదిరిపోయే షాక్ ఇచ్చారు. మంత్రి పదవి నుంచి పీకేశారు.


చివరకు నెల్లూరు జిల్లాలో గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించడంతో సొంత పార్టీ నేతల నుంచి అనిల్‌కు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు అప్పటివరకు వైసీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్టు పట్టడంతో జగన్ అనిల్ కుమార్ నెల్లూరు సిటీ నుంచి తప్పించి గుంటూరు జిల్లాకు మార్చారు. నరసరావుపేట పార్లమెంటు సిటీ కేటాయించారు. సామాజిక సమీకరణలపరంగా అనిల్ కుమార్ అక్కడ భారీ మెజార్టీతో విజయం సాధిస్తాడని జగన్ తో పాటు వైసిపి వాళ్లు నమ్మారు.. కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అసలు అనిల్ కు నెల్లూరు ను వదిలి బయటకు రావటం ఎంత మాత్రం ఇష్టం లేదు.


జగన్ చేసిన పనికి అనిల్ ఫుల్ స్టేషన్ తో ఉన్న పరిస్థితి. ఇక ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోయింది.. అనిల్ కూడా ఓడిపోయారు. అసలు అనిల్ కు ఎక్కడ రాజకీయం చేయాలో తెలియని పరిస్థితి. తన సొంత నియోజకవర్గ నెల్లూరు సిటీలో కార్యక్రమాలు చేయాలా ? లేదా తాను ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నరసరావుపేటలో పనిచేసుకోవాలా ? అన్నది తెలియని పరిస్థితి. అనిల్ కుమార్ తిరిగి నెల్లూరు వెళ్లిపోవాలన్న కోరిక బలంగా ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీ నేతలు మాత్రం అనిల్ ను తిరిగి నెల్లూరు రాకూడదని పట్టుబడుతున్నారు. ఏది ఏమైనా జగన్ చేసిన పనికి అనిల్ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి ఇప్పుడు తీవ్రమైన ప్ర‌ స్టేషన్ కు వెళ్లిపోయి లోలోన కుమిలిపోతున్న పరిస్థితి ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: