ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ పై కూటమి సర్కర్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వాలంటరీలను వదులుకొనే ప్రసక్తి లేదని అంతేకాకుండా వారికి ఇవ్వాల్సిన బకాయిలను గౌరవ వేతనాలను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామంటూ తెలిపారు. ఎన్నికల ముందు తీవ్ర వివాదంగా మారినటువంటి ఈ వాలంటరీ వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్లిందని చెప్పవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీలను తొలగిస్తారని.. చంద్రబాబు కూడా ఈ వ్యవస్థని వ్యతిరేకిస్తున్నారని విధంగా వార్తలు వినిపించాయి.


అందుకు తగ్గట్టుగానే వాలంటీలకు పదివేల రూపాయలు చేయకుండా అలాగే వారికి ఎలాంటి పనులు చెప్పకుండా జీతం ఇవ్వకుండా చేయడంతో  అందరూ కూడా వాలంటరీ వ్యవస్థ రద్దు అవుతుందని అనుకుంటున్నా సమయంలో ఈ నెల 29వ తేదీన వాలంటరీలు విజయవాడకు వెళ్లి ధర్నా చేయాలనుకున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే ఏపీ సీఎం చంద్రబాబు వారికి గుడ్ న్యూస్ తెలియజేశారు. వాలంటరీలను ఎవరిని కూడా తీసేయమని ఈ వ్యవస్థను రద్దు చేయమంటూ తెలియజేశారు.


కూటమి సర్కార్ కొలువుతీరి ఇప్పటికీ రెండు మాసాలైన ఈ వాలంటరీ వ్యవస్థ పైన ఎప్పుడు మాట్లాడకపోవడంతో వాలంటరీలు కూటమి పైన అసహనంతో ఉన్నారు. పించని వ్యవహారం పైన వీరిని తీసుకోకుండా సచివాలయ ఉద్యోగులతోనే పనిచేయడం జరిగింది. దీంతో వీరిని విధులకు దూరంగా ఉంచారని వాలంటరీలు ఆందోళన చెందడంతో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కూటమి వారి సేవలను వినియోగించుకునేందుకే ప్రయత్నిస్తున్నామని త్వరలోనే వారికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నామంటూ తెలిపారు సీఎం చంద్రబాబు. సాంకేతికల కారణాల వల్ల వాలంటరీలకు రెండు నెలల నుంచి జీతం ఇవ్వలేదని ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని గ్రామ వార్డు వాలంటరీల సచివాలయ శాఖలకు నివేదిక పంపినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు లక్ష మంది వాలంటరీలు ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ వారి పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా ఉన్నది వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: